ePaper
Wednesday, September 23, 2026
ePaper
Homeఎడిటోరియల్పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకుందాం

పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకుందాం

📰 Generate e-Paper Clip

పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకుందాం

నమస్తే భారత్ :-తొర్రూరు

అంగన్వాడి కేంద్రాలలో ప్రభుత్వం అందించే పౌష్టిక ఆహారాన్ని.గర్భిణీలు,బాలింతలు, చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలని సిడిపిఓ ఎం.రేష్మ, మడిపల్లి గ్రామ సర్పంచ్ నలుగురు రామలింగం లు అన్నారు.తల్లిపాల వారోత్సవాలలో భాగంగా
మడిపల్లి గ్రామంలో సోమవారం హరిపిరాల సెక్టార్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిడ్డ పుట్టగానే ముర్రుపాలు పట్టించాలని, గర్భిణీలు, బాలింతలు ఆకుకూర,పాలు, గుడ్లు, మాంసం ఎక్కువగా తీసుకోవడంతో తల్లి శిశువు ఆరోగ్యం.మెరుగుపడుతుందన్నారు. అంగన్వాడి సెంటర్ లలో ప్రభుత్వం పంపిణీ చేసే పౌష్టికాహారాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏసిడిపిఓ.విజయలక్ష్మి,సూపర్వైజర్ ఎస్ కె. గౌసియా,ఉప సర్పంచ్ కొండం మధుషా ఉపేందర్,హరిపరాల సెక్టార్ అంగన్వాడి టీచర్లు, గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!