ePaper
Friday, July 31, 2026
ePaper
Homeఎడిటోరియల్ప్రత్యేక ఓటరు జాబితా సవరణలో బీజేపీ క్షేత్రస్థాయి కార్యాచర

ప్రత్యేక ఓటరు జాబితా సవరణలో బీజేపీ క్షేత్రస్థాయి కార్యాచర

📰 Generate e-Paper Clip

ప్రత్యేక ఓటరు జాబితా సవరణలో బీజేపీ క్షేత్రస్థాయి కార్యాచర

-ఎస్ఆర్ఐ కార్యక్రమంలో విస్తృతంగా ఓటర్ల వివరాల పరిశీలన

-రాష్ట్ర కమిటీ పిలుపుతో ‘మండల ప్రభాస్ అభియాన్’కు శ్రీకారం

-రోడా మేస్త్రి నగర్ డివిజన్‌లో ఇంటింటికీ ఓటరు జాబితా పరిశీలన

-అర్హుల పేర్ల నమోదు, మరణించినవారి, డూప్లికేట్ పేర్ల తొలగింపుపై దృష్టి

-బీఎల్ఏ-2లు, శక్తి కేంద్ర ఇన్‌చార్జీలతో సమీక్ష సమావేశం

-జిల్లా అధికార ప్రతినిధి రచ్చ చక్రధర్ పాల్గొని దిశానిర్దేశం

-ప్రజాస్వామ్య బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపు

కుత్బుల్లాపూర్, జూలై 30 ( నమస్తే భరత్ ): భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఆర్ఐ) కార్యక్రమంలో భాగంగా గురువారం 24 గంటల మండల ప్రభాస్ అభియాన్ నిర్వహించారు. ఈ సందర్భంగా 279వ డివిజన్ రోడా మేస్త్రి నగర్ పరిధిలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి రచ్చ చక్రధర్ పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా కార్యకర్త పులి రాజు నివాసంలో అల్పాహార కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం, శక్తి కేంద్ర ఇన్‌చార్జీలు, బీఎల్ఏ-2లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై సమగ్రంగా చర్చించి, అర్హులైన కొత్త ఓటర్ల పేర్ల నమోదుకు, మరణించిన వారి పేర్లు, డూప్లికేట్ ఓటర్ల పేర్ల తొలగింపునకు అవసరమైన చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా రచ్చ చక్రధర్ మాట్లాడుతూ, పారదర్శకమైన, తప్పులులేని ఓటరు జాబితా ప్రజాస్వామ్య వ్యవస్థకు బలమైన పునాది అని పేర్కొన్నారు. ప్రతి అర్హుడైన పౌరుడు ఓటరుగా నమోదవ్వడంతో పాటు, అనర్హ పేర్ల తొలగింపుపై కార్యకర్తలు అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రోడా మేస్త్రి నగర్ డివిజన్ కోఆర్డినేటర్ భానుచందర్ వర్మ, గడ్డం రామ్‌రెడ్డి, ఎల్‌వీ రెడ్డి, టి. రాము, గోవర్ధన్ రెడ్డి, గడ్డం ప్రతాప్ రెడ్డి, మాణిక్ రెడ్డి, నరేష్ గౌడ్, మణి, కృష్ణ, నరసింహతో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!