NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 19 July 2026, 10:44 pm Posted by : NAMASTHE BHARAT

ఎస్ ఐ ఆర్ ఓటర్ లిస్ట్ సర్వే పై  అవగాహన కార్యక్రమంలో పాల్గొన  యువ చైతన్య యూత్ సభ్యులు

ఎస్ ఐ ఆర్ ఓటర్ లిస్ట్ సర్వే పై అవగాహన కార్యక్రమంలో పాల్గొన

యువ చైతన్య యూత్ సభ్యులు

నమస్తే భారత్ :-పాలకుర్తి

పాలకుర్తి మండలంలో ఎస్ ఐ ఆర్ ఓటర్ లిస్ట్ సర్వే పై అవగాహన కార్యక్రమాన్ని యువ చైతన్య యూత్ అసోసియేషన్ సభ్యులు నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు ఓటరు నమోదు, సవరణలు, మరియు ఓటరు హక్కులపై స్పష్టమైన అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా సభ్యులు ఇంటింటికీ వెళ్లి ఓటర్ లిస్ట్‌లో పేర్లు ఉన్నాయా లేదా పరిశీలించుకోవాలని, కొత్తగా 18 సంవత్సరాలు పూర్తి చేసిన వారు తప్పకుండా ఓటరుగా నమోదు కావాలని సూచించారు. అలాగే ఓటర్ ఐడీలో ఉన్న పొరపాట్లను సరిచేసుకోవడం, చిరునామా మార్పులు చేయించడం వంటి అంశాలపై.వివరించారు.ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత ముఖ్యమని, ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకోవాలని సభ్యులు పిలుపునిచ్చారు. ఓటర్ లిస్ట్ సర్వేలో ప్రజలు చురుకుగా పాల్గొని తమ వివరాలను సరిచేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎలమకంటి సందీప్, ఎడవెల్లి సోమేశ్వర్, జీడి నరేందర్ కమ్మగాని శ్రీకాంత్, పన్నీరు నాగరాజు,చిట్యాల హరికృష్ణ, రాపర్తి సోము, బి ఎల్ ఓ సరిత, పూవులమ్మ, శోభ తదితరులు పాల్గొనారు