NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 11 September 2026, 6:13 pm Posted by : NAMASTHE BHARAT

ధూమపానానికి దూరంగా ఉండాలి

ధూమపానానికి దూరంగా ఉండాలి

యువత ఆరోగ్య భారతం వైపు అడుగులు వేయాలి

మన ఆరోగ్యం మన చేతుల్లోనే

NCC కేర్ టేకింగ్ ఆఫీసర్ లక్ష్మణ్

నమస్తే భరత్, 11/9/2026/ నారాయణపేట జిల్లా

NCC యూనిట్ ఆధ్వర్యంలో “టీబీ ముఖ్త్ భారత్ అభియాన్ ర్యాలీ” నిర్వహించడం జరిగింది.పుర వీధుల గుండా తిరుగుతూ జన సమూహాలలో అవహగాహనా కల్పించే విధంగా ఛార్ట్స్ ,స్లొగన్స్ ,పాటలు ,వివిధ రూపాల్లో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది
ఈ సందర్బంగా కేర్ టేకింగ్ ఆఫీసర్ లక్ష్మణ్ మాట్లాడుతూ …..
టీబీ బ్యాక్టీరియా వల్ల గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. టీబీ సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, మాట్లాడినప్పుడు లేదా గట్టిగా నవ్వినప్పుడు వెలువడే సూక్ష్మ తుంపరలు గాలిలో కలుస్తాయి.పీల్చడం వల్ల ఆ గాలిని ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు పీల్చుకున్నప్పుడు ఆ బ్యాక్టీరియా వారి ఊపిరితిత్తులలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్‌కు దారితీస్తుందన్నారు.ఆల్కహాల్, డ్రగ్స్ వంటి అలవాట్లు ఉన్నవారు.టీబీ సోకిన రోగుల దగ్గర నిరంతరం మెలిగే కుటుంబ సభ్యులు లేదా సంరక్షకులు.మరింత అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్బంగా లక్ష్మణ్ కోరారు.
ఈ కార్యక్రమం లో పాఠశాల ఉపాధ్యాయులు వెంకటయ్య ,నరసింహ మరియు NCC క్యాడెట్స్ పాల్గొన్నారు.