NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 10 August 2026, 7:34 pm Posted by : NAMASTHE BHARAT

ప్రగతిశీల తల్లి తండ్రుల సంఘం పీపీల్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులుగా యాసారపు రజనీకాంత్ నియామకం

ప్రగతిశీల తల్లి తండ్రుల సంఘం పీపీల్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులుగా యాసారపు రజనీకాంత్ నియామకం

నమస్తే భారత్ :-తొర్రూరు

ప్రగతిశీల తల్లి తండ్రుల సంఘం పీపీల్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులుగా తొర్రూరు మండలం అమ్మపురం గ్రామానికి చెందిన యాసారపు రజనీకాంత్ ను నియమించినట్లు పిపిఎల్ రాష్ట్ర రిసోర్స్ పర్సన్, ఖమ్మం జోనల్ ఇంచార్జ్ ఐనాల పరశురాములు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం ఖమ్మం జిల్లా కేంద్రంలోని సిద్దార్థ ప్రకృతి ఆరోగ్య కేంద్రం ఆవరణలో సంఘం ఖమ్మం జోనల్ స్థాయి సమావేశం మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నిర్మాణ సన్నహక సమావేశంలో నియమించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నూతన పిపిఎల్ జిల్లా అధ్యక్షులు యాసారపు రజనీకాంత్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో నన్ను పీపీఎల్ జిల్లా అధ్యక్షులుగా నియమించిన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు మచ్చ నర్సయ్య, రాష్ట్ర అధ్యక్షులు ఈదుల రామాంజనేయులు, రాష్ట్ర రిసోర్స్ పర్సన్ డాక్టర్ పిసి వీరస్వామి, రాష్ట్ర రిసోర్స్ పర్సన్ ఖమ్మం జోనల్ ఇంచార్జ్ ఐనాల పరశురాములు లకు అభినందనలు, కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను , నిరంతరం.విద్యార్థిని,విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం, విద్యార్థుల భవిష్యత్తు, అభివృద్ధికోసం తల్లి తండ్రుల నందరిని కలుపుకొని సంఘం నిర్మాణానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు.