NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 01 August 2026, 9:57 pm Posted by : NAMASTHE BHARAT

అంగన్వాడీ సెంటర్లో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల అవగాహన కార్యక్రమం

అంగన్వాడీ సెంటర్లో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల అవగాహన కార్యక్రమం

సర్పంచ్ బోడ సోమ్లా నాయక్

సూపర్వైజర్ ఉషా

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ.మండలంలోని.అబ్బాయిపాలెం.అంగన్వాడీ.కేంద్రంలో.ప్రపంచ.తల్లిపాల.వారోత్సవాల.కార్యక్రమం.ఘనంగా.నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి సర్పంచ్ బోడ.సోమ్లా.నాయక్.ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల తల్లులు, గ్రామ పెద్దలు మరియు స్థానిక ప్రజలు.కార్యక్రమంలో తల్లిపాల ప్రాముఖ్యత, శిశువు పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలను ప్రారంభించడం, మొదటి ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే ఇవ్వడం, ఆరు నెలల తర్వాత పోషకాహారంతో పాటు రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం తల్లిపాలను కొనసాగించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి సూపర్వైజర్ ఉషా మేడం అవగాహన కల్పించారు. తల్లిపాల వల్ల శిశువుకు రోగనిరోధక శక్తి పెరగడం, ఆరోగ్యవంతమైన ఎదుగుదల మరియు మేధో వికాసం మెరుగుపడుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో.సూపర్వైజర్.ఉషా.అనిత.అంగన్వాడీ.టీచర్లు.సత్యవతి.విజయలక్ష్మి.సంపూర్ణ.కృష్ణకుమారి.లలిత.గర్భిణీ బాలింతలు, ఆశ వర్కర్ మాధవి మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు