NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 01 August 2026, 9:59 pm Posted by : NAMASTHE BHARAT

హౌసింగ్ బోర్డు అంగన్వాడీ కేంద్రంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవం

హౌసింగ్ బోర్డు అంగన్వాడీ కేంద్రంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవం

మరిపెడ ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారిని ఎం. ఎల్లమ్మ,

నమస్తే భారత్:-మరిపెడ,

శిశువుకు తల్లిపాలే అమృతమని, పుట్టిన వెంటనేబిడ్డకుఅందించే ముర్రుపాలే ప్రకృతి ప్రసాదించిన తొలి టీకా అని ఇవి అమృతంతో సమానమని,మరిపెడ ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారిని ఎం.ఎల్లమ్మ అన్నారు. శనివారం.మరిపెడమున్సిపాలిటీ కేంద్రంలోని హౌసింగ్ బోర్డు అంగన్వాడీ కేంద్రంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల (ఆగస్టు 1 నుండి 7) ప్రారంభం సందర్భంగా.గర్భిణీలు,బాలింతలకు స్థానిక ప్రాథమిక వైద్యాధికారి డాక్టర్ గుగులోతు. రవి.తో.కలిసిప్రత్యేకఅవగాహనసదస్సునిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ! బిడ్డ పుట్టిన మొదటి గంటలోపు ఇచ్చే పసుపురంగుముర్రుపాలుఎంతోపవిత్రమైనవని, అన్నారు.శిశువులో రోగనిరోధక శక్తిని పెంచి భవిష్యత్తులో డయేరియా,నిమోనియా వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా రక్షణ కవచంలా!కాపాడతాయని తెలిపారు. ఆరు నెలల వరకు బిడ్డకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలనిఅన్నారు. తేనె,నీరుపట్టించాల్సినఅవసరంలేదన్నారు. తల్లులుఎలాంటిమూఢనమ్మకాలనునమ్మకుండా! ముర్రుపాలను బిడ్డకు పట్టించాలని కోరారు. ఆరు నెలల.తర్వాతఅదనపుపౌష్టికాహారంతో పాటు, కనీసంరెండేళ్లవరకుతల్లిపాలు ఇవ్వడం తో పిల్లల మేధోశక్తి,శారీరక ఎదుగుదలఅద్భుతంగాఉంటుందని,పేర్కొన్నారు.ఈకార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ వి. రాజ్యలక్ష్మి, ఏఎన్ఎం ఝాన్సీ, ఆశా కార్యకర్త లలిత, అంగన్‌వాడీ టీచర్లు జే. ఉమారాణి, రజిత, గర్భిణీ స్త్రీలు, బాలింతలుతదితరులు పాల్గొన్నారు.