NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 19 June 2026, 8:51 am Posted by : NAMASTHE BHARAT

పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాన్ల జాన్స్ రెడ్డిల సహకారంతో

పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాన్ల జాన్స్ రెడ్డిల సహకారంతో

నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తాం

కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మడిపల్లి మాజీ ఎంపీటీసీ జక్కా మహబూబ్ రెడ్డి

నమస్తే భారత్ :-తొర్రూరు

పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాన్ల జాన్స్ రెడ్డిల సహకారంతో మండలంలోని పలు గ్రామాలలో నిరుపేద కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా నిలుస్తామని కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మడిపల్లి మాజీ ఎంపీటీసీ జక్కా మహబూబ్ రెడ్డి అన్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టిపిసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి ఆదేశాల మేరకు మండలంలోని మడిపల్లి గ్రామానికి చెందిన కేతిరెడ్డి వెంకటరెడ్డి ఇటీవల మృతి చెందారు. గుర్తురు గ్రామానికి చెందిన జడల నవీన్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు జక్కా మహబూబ్ రెడ్డి,జక్కా ఇంద్రసేనారెడ్డిలు గురువారం బాధిత కుటుంబాలను సందర్శించి వెంకట్ రెడ్డి,నవీన్ చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు.అనంతరం రెండు బాధిత కుటుంబ సభ్యులకు రూ.6 వేలు,50 కేజీల బియ్యం అందజేశారు.మడిపల్లి గ్రామానికి చెందిన వార్డు సభ్యులు మహంకాళి సంపత్ ఇటీవల అనారోగ్య సమస్యతో చికిత్స పొందడంతో ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా మహబూబ్ రెడ్డి మాట్లాడుతూ నిరుపేద బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే యశస్విని,ఝాన్సీ రెడ్డిల సహకారంతో అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు.పేదలను ప్రతి ఒక్కరు ఆదుకోవాలని అన్నారు. పేదలకు ప్రభుత్వం తరఫున అందే సంక్షేమ పథకాలు సకాలంలో అందించే విధంగా కృషి చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో గుర్తురు గ్రామ సర్పంచ్ ఇసంపల్లి కవిత బాలకృష్ణ,మాజీ సర్పంచ్ రవీంద్ర చారి,మడిపెల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెన్నం సోమిరెడ్డి, మాజీ సర్పంచ్ రావుల వెంకటరెడ్డి,రావుల శ్రీనివాస్ రెడ్డి,జక్క యాకుబ్ రెడ్డి,పోరెడ్డి ఆగి రెడ్డి, ఉమగాని శీను, ఉప్పలయ్య, అశోక్, కుమార్, ఈశ్వర్,ఎమ్మార్పీఎస్ వెంకన్న, చిరబోయిన రవి యాదవ్,యర్రం రాజు యాదవ్,మహంకాళి మోహన్, మహంకాళి మురళి,గిద్దె రవి తదితరులు పాల్గొన్నారు.