NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 22 September 2026, 6:43 pm Posted by : NAMASTHE BHARAT

*పదేళ్ల నాటి బోరుతో.. నీటి కష్టాలకు చెక్.. !*

*పదేళ్ల నాటి బోరుతో.. నీటి కష్టాలకు చెక్.. !*

*మాజీ ఉపసర్పంచ్ నిరటి రవీందర్ చొరవతో గతంలో వేసిన బోరుకు మోటార్‌ ఏర్పాటు*

*ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ సహకారంతో గ్రామస్తులకు నీటి సౌకర్యం*

నమస్తే భారత్ షాద్ నగర్, సెప్టెంబర్ 22:నందిగామ మండలం నర్సప్పగూడ గ్రామంలో నెలకొన్న నీటి సమస్యకు పరిష్కారం లభించింది. సుమారు పదేళ్ల క్రితం మాజీ ఉపసర్పంచ్ నిరటి రవీందర్ చొరవతో ఏర్పాటు చేసిన బోరుకు తాజాగా మోటార్‌ ఏర్పాటు చేయడంతో గ్రామస్తులకు నీటి సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.గ్రామంలో నెలకొన్న నీటి సమస్యను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలనే ఉద్దేశంతో షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ సహకారంతో బోరు మోటార్‌ను అందించినట్లు నిరటి రవీందర్ తెలిపారు. పదేళ్ల క్రితం వేసిన బోరు చాలాకాలంగా వినియోగంలో లేకపోవడంతో ప్రస్తుతం దానికి మోటార్‌ బిగించి తిరిగి అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు.
బోరు మోటార్‌ ఏర్పాటు కావడంతో గ్రామంలో తాగునీటి అవసరాలకు నీరు అందుబాటులోకి రావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. గ్రామస్తుల నీటి సమస్యను పరిష్కరించేందుకు సహకరించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్‌కు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొడిచెర్ల రాజేశ్వరి, ఉపసర్పంచ్ అప్పల సిద్ధయ్య, మాజీ ఉపసర్పంచ్ కట్నా శేఖర్, ఎంకిరాల నర్సింహ వార్డు సభ్యులు, సత్యం మహేందర్, శేఖర్ బీరప్ప మహేందర్ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, సురేందర్ భూపాల్ బాలరాజు శ్రీశైలం గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.