*జర్నలిస్టుల సంక్షేమానికి అండగా ఉంటాం..*
*టిడబ్ల్యూజేఎఫ్ కుత్బుల్లాపూర్ నూతన కమిటీకి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ అభినందనలు..*
*జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ.*
*నమస్తే భారత్/ కుత్బుల్లాపూర్*
ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా నిలుస్తూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని బీఆర్ఎస్ ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ అన్నారు. జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని ఆకాంక్షించారు.టిడబ్ల్యూజేఎఫ్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ నూతన కమిటీ ఎన్నికైన సందర్భంగా శనివారం సంఘం ప్రతినిధులు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి శాలువాలు కప్పి సత్కరించారు. నూతన కమిటీ సభ్యులను వారు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్ మాట్లాడుతూ, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో జర్నలిస్టుల పాత్ర ప్రశంసనీయమని, సమాజ హితం కోసం నిరంతరం పనిచేసే జర్నలిస్టుల సంక్షేమానికి తన సంపూర్ణ సహకారం ఎల్లవేళలా ఉంటుందని భరోసా ఇచ్చారు. నూతన కమిటీ ఐక్యతతో ముందుకు సాగుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.
మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర కీలకమని,ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తీసుకొస్తూ సమాజానికి సేవలందిస్తున్న జర్నలిస్టులకు తగిన గుర్తింపు, గౌరవం లభించాలని అన్నారు. జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం టిడబ్ల్యూజేఎఫ్ చేపట్టే కార్యక్రమాలకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని స్పష్టం చేశారు.అనంతరం పేట్ బషీరాబాద్ సీఐ శ్రీధర్ రెడ్డి ని
కలిసి శాలువాతో సత్కరించారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమయ్యే జర్నలిస్టుల సేవలు అభినందనీయమని సిఐ శ్రీధర్ రెడ్డి
పేర్కొన్నారు. నూతన కమిటీ సమన్వయంతో ముందుకు సాగుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పోరాడాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా టిడబ్ల్యూజేఎఫ్ నాయకులు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలని, అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు అందించి ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సంఘం నిరంతరం పనిచేస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టిడబ్ల్యూజేఎఫ్ మేడ్చల్ జిల్లా కార్యదర్శి అశోక్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అధ్యక్షులు ఏ. గోవిందరావు, కార్యదర్శి పి. బ్రహ్మచారి, ఉపాధ్యక్షుడు ఎం. దివాకర్, సంయుక్త కార్యదర్శి శ్రీశైలం,
కమిటీ సభ్యులు కుమార్ గౌడ్, సాయిరాజ్, ప్రవీణ్, సుస్మిత రెడ్డి,ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.