NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 11 November 2026, 10:02 pm Posted by : NAMASTHE BHARAT

ప్రతి ఊరుకు రోడ్డు సౌకర్యం కల్పిస్తాం

ప్రతి ఊరుకు రోడ్డు సౌకర్యం కల్పిస్తాం

పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

నమస్తే భారత్ :-తొర్రూరు

పాలకుర్తి నియోజకవర్గంలో ప్రతి ఊరుకు రోడ్డు సౌకర్యం కల్పిస్తామని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి స్పష్టం చేశారు.తొర్రూరు నుండి కంటాయపాలెం గ్రామం వరకు రూ.6 కోట్ల గిరిజన సంక్షేమ శాఖ నిధులతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు బుధవారం పాలకుర్తి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.గ్రామీణ రహదారుల నిర్మాణం, మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదన్నారు.దాంతో తండాలు, గ్రామీణ ప్రాంత రహదారులు కొత్త రూపు సంతరించుకొని.. రవాణా సౌకర్యం.మెరుగుపడనున్నదన్నారు. వాహనదారుల ఇబ్బందులు.తొలగనున్నాయన్నారు.ఇప్పటికే విరివిగా రోడ్ల నిర్మాణాలు జరిగాయని, సీఎం, సంబంధిత మంత్రుల చొరవతో అవసవరం ఉన్న ప్రతి చోటా వందల కోట్ల రూపాయలతో రహదారులను నిర్మిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రోడ్ల పరిస్థితి.మెరుగుపడిందని,నియోజకవర్గంలో ఇంకా రోడ్లకు నోచుకోని గ్రామాలను గుర్తిస్తూ ప్రభుత్వ నిధులను మంజూరు చేస్తున్నదన్నారు.సీఎం రేవంత్ రెడ్డి పాలనలో రోడ్లన్నీ బాగుపడ్డాయన్నారు. ఎల్ నినో కష్టకాలంలోనూ మారుమూల తండాలకు కూడా రహదారులు వేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తూనం శ్రావణ్ కుమార్, వైస్ చైర్మన్ సోమ రజిని రాజశేఖర్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోత్కూరి రవీంద్ర చారి,పట్టణ అధ్యక్షుడు ముద్దసాని సురేష్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు బచ్చలి లక్ష్మణ్,ఆర్ అండ్ బి డి.కృష్ణమోహన్,ఏఈ మహేష్, కాంగ్రెస్ నాయకులు చాపల బాపురెడ్డి,పెదగాని సోమయ్య, జక్కుల మహబూబ్ రెడ్డి, చింతకుంట్ల శ్రీనివాస్ రెడ్డి, మేకల కుమార్, వెంకట్ రెడ్డి,వెంకన్న యాదవ్,చెవిటి సధాకర్, బిక్షం గౌడ్,ఇంద్రసేనారెడ్డి,వెలుగు మహేశ్వరి,మహేష్ యాదవ్, మోకాటి వెంకన్న ఎనగందుల శ్రీనివాస్, పంజాల అల్లూరు, అనిత, రాణి, భవాని, భరత్ తదితరులు పాల్గొన్నారు.