NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 09 July 2026, 12:15 pm Posted by : NAMASTHE BHARAT

మరిపెడలో హెల్త్ సూపర్వైజర్ నాయిని శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన 

మరిపెడలో హెల్త్ సూపర్వైజర్ నాయిని శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన

ప్రభుత్వ విప్ డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ సీతారాంపురం నివాసి, హెల్త్ సూపర్వైజర్ శ్రీ నాయిని శ్రీనివాస్ నివాసానికి ప్రభుత్వ విప్ మరియు డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ వెళ్లి పరామర్శించారు.ఇటీవల శ్రీ నాయిని శ్రీనివాస్ తల్లి నాయిని అనసూయ మరణించిన నేపథ్యంలో, వారి కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలియజేసి, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, ఈ క్లిష్ట సమయంలో అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మరిపెడ మండల కాంగ్రెస్ అధ్యక్షులు పెండ్లి రఘువీర్ రెడ్డి కాంగ్రెస్ మహబూబాబాద్ జిల్లా యువ నాయకులు నూకల అభినవ్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీపాల్ రెడ్డి , మాజీ సర్పంచ్ పాంగోత్ రామ్‌లాల్ 4వ వార్డు కౌన్సిలర్ మెరుగు 3వ వార్డు కౌన్సిలర్ పాంగోత్ రాము 14వ వార్డు కౌన్సిలర్ సురేష్ నాయక్ సీనియర్ నాయకులు గుండగాని వెంకన్న మైనారిటీ నాయకులు అప్సర్ యాకుబ్ పాషా తదితరులు పాల్గొన్న