బాధిత కుటుంబాలని పరామర్శించి ఆర్ధిక సహాయం అందించిన

తొర్రూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు.మడిపల్లి గ్రామ మాజీ ఎంపిటిసి జక్కా మహబూబ్ రెడ్డి మరియు జక్కా ఇంద్రసేన రెడ్డి
నమస్తే భారత్ :-తొర్రూర్
మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం.చీకటాయపాలెంగ్రామానికి చెందిన ఉడుత బక్కయ్య మృతి చందగా విషయం తెలుసుకున్న తొర్రుర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మడిపల్లి గ్రామ మాజీ ఎంపిటిసి జక్కా మహబూబ్ రెడ్డి మరియు జక్కా ఇంద్రసేన రెడ్డి గార్లు బక్కయ్య చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చి బాధితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం 3000 వేలు మరియు 25 కేజీల బియ్యాన్ని అందించారు.మరియు అదే గ్రామానికి చెందిన పులిసేరు సమ్మయ్య మృతి చెందగా వారి చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు 3000 మరియు 25 కేజీల బియ్యాన్ని అందించారు. ఈ సందర్భంగా జక్కన్న స్ఫూర్తితో చీకటయపాలెం గ్రామ సర్పంచ్ చిదురాల కృష్ణమూర్తి ఉడుత బక్కయ్య కుటుంబ సభ్యులకు ₹1500 ఆర్థిక సహాయం మరియు పులిసేరి సమ్మయ్య కుటుంబ సభ్యులకు 1500 రూపాయల ఆర్థిక సహాయం అందించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఒక్కొక్క కుటుంబానికి 4500 చొప్పున 9000/- వేల రూపాయల నగదు మరియు ఒక్కొక్క కుటుంబానికి 25 కేజీల చొప్పున 50 కేజీల బియ్యాన్ని అందించారు.అనంతరం బాధితుని కుటుంబ సభ్యులను ఓదార్చి పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మరియు టిపీసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డిగార్ల సహకారంతో అన్ని విధాలుగా ఆధుకుంటామని భరోసా కల్పించార.ఈ కార్యక్రమంలో వారితోపాటు చీకటాయపాలెం గ్రామ సర్పంచ్ చిదురాల కృష్ణమూర్తి, ఉప సర్పంచ్ పోడకంటి సరస్వతి శేఖర్, కిష్టాపురం గ్రామ సర్పంచ్ నకిరేకంటి మాధవి సంపత్, గోపాలగిరి గ్రామ సర్పంచ్ యనమాల సావిత్రి శ్రీనివాస్, మడిపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు వెన్నం సోమిరెడ్డి, వల్లపు రాఘవులు,మహంకాళి సంపత్, యర్రం రాజు యాదవ్, బూర్గుల దస్తగిరి, పులి రామచంద్రయ్య, దిండి వీరన్న, గజ్జి మహేష్, వార్డు సభ్యులు వేల్పు కొండ యాకన్న, గజ్జి మనోహర్, వేల్పు కొండ శోభా మురళి, వేల్పుల వెంకన్న, మహంకాళి మోహన్ రావు, తండ రవి, సింగం దామోదర్, పల్లె దయాకర్, తండ యాకయ్య, తండా లింగయ్య, తండ అశోక్, ఎండి సలీమా, హిమం సాహెబ్, చంటి మురళి తదితరులు పాల్గొన్నారు