NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 17 September 2026, 8:31 am Posted by : NAMASTHE BHARAT

పలు కుటుంబాలను పరామర్శించి బాధితులకు భరోసా కల్పించిన

పలు కుటుంబాలను పరామర్శించి బాధితులకు భరోసా కల్పించిన

మాజీ మంత్రి సత్యవతి రాథోడ్

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ మరిపెడ మండలంలో ఇటీవల మృతి చెందిన పలువురి కుటుంబాలను మాజీ మంత్రి, సత్యవతి.రాథోడ్.పరామర్శించారు.మరిపెడ బంగ్లాలో పానుగోతు లక్పతి పార్థివదేహానికి.నివాళులర్పించి.కుటుంబ.సభ్యులను.పరామర్శించారు,అలాగే పోతుల గోవర్ధన్ తల్లి కాంతమ్మ దశదిన కార్యక్రమంలో పాల్గొని కుటుంబ సభ్యులను పరామర్శించి, గోవర్ధన్ విలేకరి కి ₹5,000.ఆర్థిక.సహాయం.అందించారు.బురాన్‌పురం గ్రామంలో నల్లబోడు ప్రవీణ్ రెడ్డి తల్లి అనురాధ (సునంద) నెలమాసిక కార్యక్రమంలో పాల్గొన్నారు అదే గ్రామానికి చెందిన ఎస్కే రంజాన్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు
నీలికుర్తి గ్రామంలో ఇటీవల మృతి చెందిన పగిండ్ల ఎల్లయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు,
ఎల్లంపేట గ్రామంలో ఇటీవల మృతి చెందిన ఉర్లుకొండ సురేష్ కుటుంబాన్ని కూడా పరామర్శించి వారికి సానుభూతి తెలిపారు
ఈ కార్యక్రమాల్లో నీలికుర్తి సర్పంచ్ గౌతమ్, మాజీ సర్పంచ్ తొట్టి శీను, సత్యం, శ్రీను, కొంపెల్లి వేణు, యాకూబ్ పాషా, గండి మహేష్, శోభన్, ఉపేందర్, బొడ శ్రీను నాయక్ తదితరులు పాల్గొన్నారు