NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 03 July 2026, 6:55 pm Posted by : NAMASTHE BHARAT

బోన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న యువకుడు గుగులోతు పార్ధును పరామర్శించిన 

బోన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న యువకుడు గుగులోతు పార్ధును పరామర్శించిన

సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎండి అబ్దుల్ రషీద్ –

ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ బంగ్లా మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డుకు చెందిన గుగులోతు వీరేందర్ కుమారుడు గుగులోతు పార్ధు (22) బోన్ క్యాన్సర్ (GCTB) వ్యాధితో తీవ్రంగా బాధపడుతున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఎండి అబ్దుల్ రషీద్ పార్ధును పరామర్శించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కుటుంబ ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా ఉండటంతో చికిత్స ఖర్చులను భరించడం వారికి సాధ్యం కావడం లేదన్నారు. అందువల్ల దాతలు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, సేవాభావం కలిగిన ప్రతి ఒక్కరూ మానవత్వంతో ముందుకు వచ్చి తమ వంతు ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.సహాయం చేయాలనుకునే వారు పోస్టర్‌లో ఉన్న ఫోన్ పే / గూగుల్ పే ద్వారా లేదా నంబర్: 9949610684 కు నేరుగా విరాళాలు పంపవచ్చని తెలిపారు.మీరు అందించే ప్రతి చిన్న సహాయం కూడా ఒక యువకుడి జీవితంలో కొత్త ఆశను నింపుతుంది. దయచేసి స్పందించి మానవత్వాన్ని చాటండి.