ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు
ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు ఖానాపురం సెప్టెంబర్ 17 (నమస్తే భారత్ ) : ఖానాపురం మండలం బుధరావుపేటలో విశ్వకర్మ జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా జెండాను అవిష్కరించి పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా అధ్యక్షులు నేలకొండ యాకన్న చారి మాట్లాడుతూ విశ్వకర్మ జయంతి అనేది హిందూ దేవుడు, దైవిక వాస్తుశిల్పి అయిన విశ్వకర్మ పుట్టినరోజున నిర్వహించే పండుగ. ప్రతి సంవత్సరం సెప్టెంబరు 17న విశ్వకర్మ జయంతి పూజలు నిర్వహిస్తామన్నారు. హిందూ పురాణాల ప్రకారం విశ్వకర్మ స్వయంభుగా, ప్రపంచ సృష్టికర్తగా...