ఇంఛార్జీ ఎంఈఓగా వెంకట్రామ్ బాధ్యతల స్వీకరణ
ఇంఛార్జీ ఎంఈఓగా వెంకట్రామ్ బాధ్యతల స్వీకరణ ఖానాపురం ఆగష్టు17(నమస్తే భారత్ ) : ఖానాపురం మండల ఇంఛార్జీ విద్యాధికారిగా బి. వెంకట్రామ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. జెడ్పీహెచ్‌ఎస్ దబ్బీర్‌పేట్‌లో జీహెచ్‌ఎం గ్రేడ్–2గా విధులు నిర్వహిస్తున్న ఆయనను మండల విద్యాధికారిగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం ఖానాపురం మండల విద్యాశాఖ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన వెంకట్రామ్‌కు మండలంలోని ఉపాధ్యాయులు, విద్యాశాఖ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.