NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 03 July 2026, 12:19 pm Posted by : NAMASTHE BHARAT

ఖానాపురం సోసైటీ  ఛైర్ పర్సన్ గా వల్లె శ్రీను 

ఖానాపురం సోసైటీ ఛైర్ పర్సన్ గా వల్లె శ్రీను

ఖానాపురం జూలై2 (నమస్తే భారత్ ) :

ఖానాపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కొత్త ఛైర్ పర్సన్ గా ధర్మరావుపేటకు చెందిన వల్లె శ్రీను ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సోసైటి పర్సన్ ఇంఛార్జీలు (డైరక్టర్ లు ) గా బండి వెంకన్న ,శివరాత్రి వెంకన్న, బాషబోయిన రవి ,దేవినేని వేణుగోపాల్ రావు ,బొబ్బ విధ్యాసాగర్ , జట్టంగి నాగారాజు ,ఎర్రరజిత ,లింగిడి వెంకటేశ్వర్లు ,బాల్గు లక్ష్మణ్ , చెడిపాక రజిత ,నూనావత్ భిచ్ఛ్యా లను నియమిస్తూ ప్రభుత్వ సెక్రటరీ కె.సురెందర్ మెహన్ ఆదేశాలు జారీ చేశారు.ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పునర్వ్యవస్థీకరణ దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా సంఘాల పాత పాలక వర్గాల స్థానంలో నామినేటెడ్ పద్ధతిన కొత్త పర్సన్ ఇన్చార్జ్ కమిటీలను నియమిస్తూ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నూతన కమిటీల పదవీకాలం ఆరు నెలలు లేదా సహకార సంఘాల తదుపరి ఎన్నికలు జరిగే వరకు కొనసాగుతుందని తెలిపింది. సంఘాల పరిధిలోని రైతులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా, వారి సేవలకు ఎక్కడా అంతరాయం ఏర్పడకుండా ఉండేందుకే ప్రభుత్వం ఈ తాత్కాలిక ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ఖానాపురం సోసైటీ పాలకవర్గంను నియమించిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి ఈసందర్భంగా వల్లె శ్రీను కృతజ్ఞతలు తెలిపారు.