NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 15 July 2026, 6:30 pm Posted by : NAMASTHE BHARAT

ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన వల్లె శ్రీనివాస్

ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన వల్లె శ్రీనివాస్

ఖానాపురం జూలై 15 (నమస్తే భారత్ ) :

ఖానాపురం సోసైటీ ఛైర్మన్ గా వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) కార్యదర్శిగా నియమించేందుకు సిఫారసు చేసి అవకాశం కల్పించిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి కి వల్లె శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తనను జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా నియమించిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కి, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహమ్మద్ అయూబ్ ఖాన్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వల్లె శ్రీనావాస్ మాట్లాడుతూ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అదేసాను సారంగా నడుచుకుంటూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి నిజాయితీ, నిబద్ధత, అంకితభావంతో పనిచేస్తూ పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తానని చెప్పారు. తన నియమాకానికి సహకరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.