NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 22 August 2026, 10:28 pm Posted by : NAMASTHE BHARAT

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం స్థానిక ప్రజా సంఘాల భవనంలో కామ్రేడ్ తాటికొండ అనంత చారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ అల్వాల వీరయ్య పాల్గొని మాట్లాడుతూ, కేంద్రా, రాష్ట్రాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలన్నారు, కేంద్ర బిజెపి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి 12 సంవత్సరాలు గడిచిన నేటికీ వాటిని అమలు చేయలేదు, కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 10 లక్షలకు పైగా ఖాళీగా ఉన్న పోస్టులను, త్వరగా భర్తీ చేయాలన్నారు, రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలను వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయాలన్నారు, రాష్ట్ర పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 20000 ఉద్యోగాలను,DSC, జెల్, DL, గ్రూప్స్ 1,2,3,4, కేటగిరీల ఉద్యోగాలను కూడా భర్తీ చేయాలన్నారు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే వరకు నెలకు నిరుద్యోగులకు నెలకు 5000 రూపాయలు నిరుద్యోగభివృద్ధి ఇవ్వాలన్నారు, రాజీవ్ యువ వికాస్ పథకాన్ని అమలు చేయాలి స్థానిక పరిశ్రమలలో స్థానికులకే ఉద్యోగ భద్రత కల్పించాలి, ప్రైవేట్ రంగాలలో రిజర్వేషన్లు అమలు చేయాలి
ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎం) మండల కార్యదర్శి ఉండగాని మధుసూదన్, మండల నాయకులు బాణాల రాజన్న, కొండ ఉప్పలయ్య, అల్వాల యాకమ్మ, తాడూరి వీరేంకులు చెన్నబోయిన లాలయ్య, నలబొరు లక్ష్మారెడ్డి ఎస్.కె ఇమామ్ సాబ్, మొగిలి యాకయ్య, పోలేపక గణేష్, ఎల్లమ్మ భూక్య చంద్రనాయక్ తదితరులు పాల్గొన్నారు