NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 17 July 2026, 9:08 pm Posted by : NAMASTHE BHARAT

షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆదేశానుసారం అమరవీరుల స్తూపం ఆవిష్కరణ

షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆదేశానుసారం అమరవీరుల స్తూపం ఆవిష్కరణ

పనులను పరిశీలించిన కాంగ్రెస్ నేతలు

జులై 19వ తారీకు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు అమరవీరుల స్తూపం ఆవిష్కరణ

నమస్తే భారత్ షాద్ నగర్ జులై 17:తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ షాద్ నగర్ ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ సహకారంతో నిర్మించ తలపెట్టిన అమరవీరుల స్తూపం ఈనెల 19న ఆదివారం రోజు ఉదయం 9:30 గంటలకు స్థానిక మండల పరిషత్ ఆవరణలో ఆవిష్కృతం కాబోతున్నది.ఈ సందర్భంగా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆదేశానుసారం షాద్ నగర్ మున్సిపల్ మాజీ చైర్మన్ అగ్రనూరు విశ్వం,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ అలీ ఖాన్,మలిదశ ఉద్యమకారుడు నడికూడ యాదగిరి యాదవ్, మైనార్టీ సెల్ నాయకులు ఇబ్రహీం తదితరులు ఇట్టి పనులను పరిశీలించడం జరిగింది.