కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి
వామపక్ష విద్యార్థి సంఘాలు ఎస్ఎఫ్ఐ, పిడిఎస్యు ఆధ్వర్యంలో మరిపెడ మండల కేంద్రంలోని బంద్ అనంతరం విద్యార్థుల తో భారీ రాస్తారోకో నిర్వహించడం జరిగింది.
ఎస్ఎఫ్ఐ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు గంధసిరి జ్యోతిబసు, పిడిఎస్యు జిల్లా నాయకులు రాచకొండ ఉదయ్
నమస్తే భారత్ :-మరిపెడ
నీట్ పేపర్ లీకేజీ బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని మరియు ఢిల్లీలోని విద్యార్థులపై లాఠీచార్జ్ చేసిన పోలీస్, ఆర్ఎస్ఎస్ గుండాలను శిక్షించాలని వామపక్ష విద్యార్థి సంఘాలు ఎస్ఎఫ్ఐ, పిడిఎస్యు ఆధ్వర్యంలో బంద్ అనంతరం మరిపెడ మండల కేంద్రంలోని విద్యార్థులతో కలిసి భారీ రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా గంధసిరి జ్యోతిబసు మాట్లాడుతూ.. యువతతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం చిరుకాలం నిలిచినట్టు చరిత్రలో ఎక్కడ లేదు,, యువత రక్తంతో రాజకీయం చేస్తున్న మోడీ పతనం ఇప్పటినుంచే మొదలైంది అని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇప్పటికైనా కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, చనిపోయిన విద్యార్థిని, విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలి, నీట్ పరీక్ష నిర్వహిస్తున్నటువంటి ఎన్టీఎ ను రద్దు చేయాలి, నీట్ పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పాజెప్పాలి, దేశ సంపద అయినటువంటి విద్యార్థులపై లాఠీచార్జ్ చేసిన పోలీసులు ఆర్ఎస్ఎస్, బజరంగ్దళ్ గుండాలపై చట్టపరమైన చర్యలు తీసుకొని నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేసారు. విద్యార్థుల నాణ్యమైన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించకుంటే భవిష్యత్తు పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మరిపెడ మండల కార్యదర్శి పెద్దపులి బాసు, పి డి ఎస్ యు మండల నాయకులు రోహిత్, నందు, గణేష్, కిట్టు ఎస్ ఎఫ్ ఐ నాయకులు జగన్, శ్రీకాంత్, రమేష్, వంశీ, అనూష, శ్రీకన్య, శిరీష, స్వప్న, చంటి, నాగరాజు, రాఘవ తదితరులు పాల్గొన్నారు.