NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 15 July 2026, 8:58 pm Posted by : NAMASTHE BHARAT

జనతా ట్రస్ట్ అద్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతం

జనతా ట్రస్ట్ అద్వర్యంలో

ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతం

 

నర్సంపేట జులై15 ( నమస్తే భారత్ ) :

జనతా ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో, శంకర ఐ ఫౌండేషన్ సహకారంతో నర్సంపేటలో బుధవారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతంగా ముగిసింది.ఈ శిబిరంలో మొత్తం 1,270 మంది కంటి పరీక్షలు చేయించుకోగా, అవసరమైన 356 మందికి ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేశారు. అలాగే తీవ్రమైన కంటి సమస్యలు, శుక్లాలు (క్యాటరాక్ట్) వంటి వ్యాధులతో బాధపడుతున్న 135 మందిని ఉచిత కంటి ఆపరేషన్ల కోసం ఎంపిక చేసి, జనతా ట్రస్ట్  మరియు శంకర్ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో జనతా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇటువంటి సేవా కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలు ఆరోగ్యంపై అవగాహన పెంచుకుని ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన శంకర ఐ ఫౌండేషన్ వైద్య బృందానికి, సేవా కార్యక్రమంలో పాల్గొన్న వాలంటీర్లకు, దాతలకు మరియు పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజలకు డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.