NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 07 September 2026, 7:31 pm Posted by : NAMASTHE BHARAT

నర్సింహులపేట ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక అధ్యక్షులుగా సలుగు నాగన్న

నర్సింహులపేట ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

అధ్యక్షులుగా సలుగు నాగన్న

ప్రధాన కార్యదర్శిగా చలమల్ల గణేష్

శుభాకాంక్షలు తెలిపిన ప్రెస్ క్లబ్ సభ్యులు

నమస్తే భారత్ :-నర్సింహులపేట

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మడల కేంద్రం జిల్లా పరిషత్ ప్రాథమిక ఉన్నంత పాఠశాల ఆవరణంలో: ఇటీవల ప్రెస్ క్లబ్ నూతన ప్రధాన కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఇందులో నర్సింహులపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా సలుగు నాగన్న,గౌరవ అధ్యక్షులుగా గడ్డి యాకన్న సలహాదారుగా , చౌదరపు.శ్రీనివాస్ ,అధ్యక్షుడిగా సలుగు నాగన్న, ప్రధాన కార్యదర్శిగా చలమల్ల గణేష్ ,కోశాధికారిగా ఎర్ర వెంకట్రాం నరసయ్య , ఉపాధ్యక్షులుగా నిమ్మల నరేష్, బత్తిని సతీష్ , సహాయ కార్యదర్శిగా గూగులోత్ రమేష్, దాడుల కమిటీ కి మందుల యాకూబ్, బేతమల్ల అశోక్ ,సాయి లను ఎన్నుకున్నారు.ఇందుకు నరసింహపేట ప్రెస్ క్లబ్ సభ్యులు ఆమోదం తెలిపారు.ఈ సందర్భంగా అధ్యక్షులు సలుగు నాగన్న మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నర్సింహులపేట ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం తనను అధ్యక్షులుగా ఎన్నుకోవడం సంతోషంగా.ఉందన్నారు.పాత్రికేయ వృత్తి ఎంతో ఉన్నతమైందని సమాజంలో జరిగే పరిణామాలను ప్రజలకు వివరిస్తూ నిస్వార్ధమైన సేవలందించడంలో ముందుంటానని.సమిష్టి కృషితో నర్సింహులపేట ప్రెస్ క్లబ్ అభివృద్ధికి బాటలు వేద్దామని.పిలుపునిచ్చారు.అనంతరం గౌరవ సలహాదారు, చౌడారపు శ్రీనివాస్ మాట్లాడుతూ మహోన్నత.ఆశయం,సమాజానికి మంచి చేయాలనే సదుద్దేశంతో ఏర్పాటైన నర్సింహులపేట ప్రెస్ క్లబ్ గౌరవ సలహాదారులుగా తనను నియమించడం ఆనందంగా ఉందన్నారు. నరసింహులపేట ప్రెస్ క్లబ్ పాత్రికేయుల సంక్షేమం అభ్యున్నతికి తన సంపూర్ణ సహకారం.అందిస్తానన్నారు.పాత్రికేయ వృత్తిలో తనకు అనుభవం ఉంది అయినప్పటికీ ఈ రంగంలో తనకు అందరూ సన్నిహితులేనన్నారు.సమాజంలోని.సమస్యలను,లోటుపాట్లను నిర్భయంగా ప్రచురించి ప్రజల పక్షాన కలం గళం వినిపించాలని ఆయన సూచించారు. నరసింహులపేట ప్రెస్ క్లబ్ దినదినాభివృద్ధి సాధించాలని.ఆకాంక్షించారు.నూతన.అధ్యక్ష,కార్యదర్శి,కోశాధికారులు మాట్లాడుతూ తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతగా నిర్వర్తిస్తామని, నరసింహుల పేట ప్రెస్ క్లబ్ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా.పనిచేస్తామని,పాత్రికేయుల సమస్యలపై పోరాటం చేసి వారి అభ్యున్నతికి కృషి చేస్తామని స్పష్టం చేశారు.సమాజ శ్రేయస్సు కోసం పనిచేయడంలో నరసింహులపేట ప్రెస్ క్లబ్ ను ముందు వరుసలో నిలుపుతామని వెల్లడించారు.తమకు ఈ అవకాశం కల్పించిన నరసింహులపేట ప్రెస్ క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం సభ్యులు నూతన ప్రధాన కమిటీని శాలువాలతో ఘనంగా సన్మానించారు.