NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 08 August 2026, 2:33 pm Posted by : NAMASTHE BHARAT

ట్రైబ్స్ కు చట్టాల పట్ల అవగాహన ఉండాలి – విద్యార్థి దశలోనే పూర్తి పరిజ్ఞానం అవసరం

ట్రైబ్స్ కు చట్టాల పట్ల అవగాహన ఉండాలి
– విద్యార్థి దశలోనే పూర్తి పరిజ్ఞానం అవసరం
– తొర్రూర్ ప్యానల్ కమిటీ సభ్యుడు అడ్వకేట్ సైదులు

నమస్తే భారత్ :-మరిపెడ

ట్రైబల్ ప్రజలు కేంద్ర, రాష్ట్రానికి సంబంధించిన ట్రైబల్ చట్టాలు, పథకాలపై అవగాహన కలిగి ఉండాలని, మహబూబాబాద్ జిల్లాలో దాదాపు 60శాతం ప్రజలు గిరిజన, కొయ జాతి ప్రజలు ఉన్నారని వారి పిల్లలకు విద్యార్థి దశలోనే అవగాహన కల్పించేందుకు న్యాయసేవాధికార సంస్థ కృషి చేస్తుందని తొర్రూర్ ప్యానల్ కమిటీ సభ్యుడు అడ్వకేట్ తొనుకూరి సైదులు అన్నారు. శుక్రవారం ఆయన మరిపెడ మునిసిపల్ కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల, కళాశాల విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అడ్వకేట్ సైదులు మాట్లాడుతూ దేశంలో వెనుకబడిన ప్రజానికమైన ట్రైబల్స్ ఎన్నో ఏళ్లుగా బాహ్యప్రపంచానికి దూరంగా, అటవీ ప్రాంతంలో ఆవాసం ఏర్పరుచుకని ఉన్నారన్నారు. అలాంటి ట్రైబ్స్ కోసం కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు పలు చట్టాలు, పథకాలు రూపొందించి వారి అభ్యున్నతికి కృషి చేస్తున్నాయన్నారు. ప్రజలకు ఎలాంటి అన్యాయం జరిగినా న్యాయశాఖ వారికి ఎల్లప్పుడు అండగా నిలుస్తుందని, వారి కోసం ఏర్పటు చేసిన చట్టాలను తెలుసుకుని కోర్టులను ఆశ్రయిస్తే వారికి న్యాయం చేకూరుతుందన్నారు. అదే విధంగా విద్యకు దూరమైన గిరిజన, కోయ, వెనుకబడిన తరగతుల ప్రజలకోసం కూడా 2009లో కేంద్రం విద్యా యాక్ట్ తీసుకుని వచ్చి బడీడు పిల్లలు తప్పనిసరిగా బడికి పంపాలని చట్టం తీసుకురావటం జరిగిందన్నారు. అదే విధంగా సాంకేతికత, పట్టణ నాగరికతకు దూరంగా ఉన్న ట్రైబ్స్ కోసం పీఎం ఆవాస్ యోజన, పీఎం కుసుమ్ యోజన, ఉపాధి తదితర పథకాలను తీసుకురావటం జరిగిందన్నారు. సమాజంలోని మంచి, చెడుల నిర్ధారణ చట్టాల పట్ల అవగాహన విద్యార్థి దశ నుంచే కలిగి ఉండటం కీలకమని, తద్వారా దేశంలో నేరాల సంఖ్య అదుపులోకి వస్తుందన్నారు. ఈ కార్య్రకమంలో ప్రిన్సిపల్ రామ్ మోహన్, వైస్ ప్రిన్సిపల్ రాజ్ కుమార్, ఉపాధ్యాయులు జీ. ఉపేందర్, బి. భావ్ సింగ్, ఏ. నరేష్, బీ. వీరన్న, పీఈటీ ప్రభు, సాగర్ తదితరులు పాల్గొన్నారు.