NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 10 November 2026, 9:41 pm Posted by : NAMASTHE BHARAT

చిన్నారుల అభివృద్ధిపై అంగన్వాడీలకు శిక్షణ

చిన్నారుల అభివృద్ధిపై అంగన్వాడీలకు శిక్షణ

తొండంగి: చిన్నారుల సమగ్ర అభివృద్ధికి అంగన్వాడీ కార్యకర్తలు ప్రత్యేక శ్రద్ధ చూపాలని తొండంగి సెక్టార్ సూపర్‌వైజర్ వి. అరుణ సూచించారు. పోషణ్ భీ పడాయీ భీ రౌండ్–02 (2026–27)లో భాగంగా నవంబరు 9, 10 తేదీల్లో సింగివృక్షం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండలస్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పుట్టినప్పటి నుంచి మూడేళ్లలోపు పిల్లల్లో వయస్సుకు అనుగుణంగా జరగాల్సిన అభివృద్ధిని గుర్తించేందుకు నవచేతన గృహ సందర్శనలు చేపట్టాలన్నారు. పిల్లల ఎదుగుదలను పరిశీలించి తల్లులకు తగిన సలహాలు, సూచనలు అందించాలని పేర్కొన్నారు. అవసరమైన సందర్భాల్లో వైద్య పరీక్షలు చేయించాలని సూచించారు. మూడు నుంచి ఆరేళ్లలోపు చిన్నారులకు ఆసక్తికరమైన రీతిలో ఈసీసీఈ ప్రీ స్కూల్ విద్య అందించాలని తెలిపారు. ఆధార్‌శిల మార్గదర్శకాలకు అనుగుణంగా బోధన సాగించాలని వివరించారు. కార్యక్రమంలో తొండంగి మండల పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.