NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 09 October 2026, 8:54 pm Posted by : NAMASTHE BHARAT

టి.పి.టి.ఎఫ్. మరిపెడ మండల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

టి.పి.టి.ఎఫ్. మరిపెడ మండల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

నమస్తే భారత్ :-మరిపెడ

తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టి.పి.టి.ఎఫ్.) మరిపెడ మండల శాఖ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా మహమ్మద్ హఫీజర్, ప్రధాన కార్యదర్శిగా నల్లా పవన్ కుమార్, జిల్లా కౌన్సిలర్‌గా గంగరబోయిన మంజు భార్గవి ఎన్నికయ్యారు.
మండల ఉపాధ్యక్షులుగా దోసపాటి మల్లయ్య, తలారి ఇందిర, కార్యదర్శులుగా వడ్కాపురం కృష్ణ, బి. లచ్చిరాం, మేరుగు భాస్కర్ ఎన్నికయ్యారు. ఆడిట్ కమిటీ కన్వీనర్‌గా చంద్రగిరి మహేశ్వర్, అకడమిక్ సెల్ కన్వీనర్‌గా మాచర్ల రవి, జీఓ కమిటీ కన్వీనర్‌గా చందా రవీంద్ర కుమార్ ఎంపికయ్యారు.
ఈ కమిటీ ఎన్నికలకు తాళ్లూరి రవీందర్ ఎన్నికల పరిశీలకుడిగా, పులిచింత విష్ణువర్ధన్ రెడ్డి ఎన్నికల నిర్వహకుడిగా వ్యవహరించారు.