ఆర్టీసీ ఆధ్వర్యంలో మూడు రోజుల ప్రత్యేక ఆధ్యాత్మిక యాత్ర
ఆర్టీసీ డిపో మేనేజర్ ఎం సరస్వతి
నర్సంపేట జూన్ 15 (నమస్తే భారత్ ) :
పర్యాటకులు, భక్తులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నర్సంపేట డిపో ఆధ్వర్యంలో జూన్ 20వ తేదీ (శనివారం) ఉదయం 3 గంటలకు 36 సీట్ల సూపర్ లగ్జరీ బస్సుతో మూడు రోజుల ప్రత్యేక ఆధ్యాత్మిక యాత్రను నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ శ్రీమతి ఎం. సరస్వతి తెలిపారు. ఈ యాత్రలో ప్రముఖ పుణ్యక్షేత్రాలైన శ్రీశైలం, మహానంది, బనగానపల్లె, యాగంటి, జోగులాంబ అమ్మవారి ఆలయం (శక్తి పీఠం), అలాగే స్వర్ణగిరి క్షేత్రాలను సందర్శించే అవకాశం కల్పించనున్నారు. యాత్రకు ఒక్కో ప్రయాణికుడికి టికెట్ ధర 2,600 రూపాయలు నిర్ణయించినట్టు తెలిపారు. భక్తులు, పర్యాటకులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలని డిపో మేనేజర్ కోరారు. ముందస్తు సీట్ల బుకింగ్ కోసం 9704644543, 8688357107 నంబర్లను సంప్రదించాలని సూచించారు. ఈ ప్రత్యేక ఆధ్యాత్మిక యాత్రకు పరిమిత సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నందున ఆసక్తి గల యాత్రికులు ముందుగానే తమ సీట్లను బుక్ చేసుకోవాలని డిపో మేనేజర్ అధికారులు తెలిపారు.