NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 19 September 2026, 10:18 am Posted by : NAMASTHE BHARAT

అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్న రంగయ్యను పరామర్శించిన మూడో వార్డు బీఆర్‌ఎస్ నాయకులు

అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్న రంగయ్యను పరామర్శించిన

మూడో వార్డు బీఆర్‌ఎస్ నాయకులు

నమస్తే భారత్ :-మరిపెడ

ఇటీవల గుండె సంబంధిత అనారోగ్యానికి గురై ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న మూడో వార్డులోని సీతారాంపురం కాలనీకి చెందిన హన్మకొండ రంగయ్యను సీతారాంపురం బీఆర్‌ఎస్ నాయకులు పరామర్శించారు.
ఈ సందర్భంగా రంగయ్య ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయనకు మనోధైర్యం కల్పిస్తూ, అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని తెలిపారు.ఈ పరామర్శ కార్యక్రమంలో సీతారాంపురం బీఆర్‌ఎస్ నాయకులు రేఖ వెంకటేశ్వర్లు, వార్డు అధ్యక్షులు కొచర్ల రవి, యూత్ అధ్యక్షులు కొక్కు సునీల్, నాయకులు వీరబోయిన మురళి, జినక శ్రీరాములు, వీరబోయిన అచ్చయ్య, కలమాచర్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు