వి బి జి రామ్ జి పథకాన్ని తక్షణమే రద్దు చేయాలి, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి
మరిపెడ మండలంలోని నిరసన కార్యక్రమాలు
నమస్తే భారత్ :-మరిపెడ
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం లోనీ, ఎల్లంపేట, బోటియ తండా, సోమ్లా తండా, ఆనేపురం, చిల్లంచర్ల, గుండె పూడి, తానంచర్ల, బునాహంపురం, అబ్బాయి పాలెం, పి ఎస్ గూడం, బాల్య ధర్మారం, అమృ నాయక్ తండ, గాలి వారి గూడెం, మరిపెడ, తదితర గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు చేయడం జరిగిందని, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, జిల్లా ప్రధాన కార్యదర్శి, అలవాల వీరయ్య, గుండ గాని మధుసూదన్ సంయుక్త పట్టణ చేశారు, దేశంలోనీ బిజెపి ప్రభుత్వం మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టంనీ తొలగించి, దాని స్థానంలో విబిజి రాంజీ పథకాన్ని తీసుకురావడానికి ఆయన తీవ్రంగా విమర్శించారు, దీని ద్వారా దేశంలో దాదాపు 40 కోట్ల మంది, గ్రామీణ పేదలు నష్టపోతారని వివరించారు, రాంజీ పథకం కేంద్ర గవర్నమెంట్, 60 శాతం నిధులు, మరియు రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు కేటాయించడాన్ని, మట్టి చూస్తే చట్టాన్ని తప్పు దోవ పట్టించే విధానమే అని, దేశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు లేక పూర్తిగా ఇబ్బంది పడుతున్నాయని, దీనికి తోడుగా కేంద్ర ప్రభుత్వం, మహాత్మ గాంధీ జాతీయ పదాన్ని చట్టానికి, 40% నిధులు కేటాయించడం అనడం, రాష్ట్ర ప్రభుత్వం ఇరకటంలో పెట్టే పని అవుతుందని విమర్శించారు, ఈ చట్టం 2006లో ఏర్పడ్డాక, దేశంలో గ్రామీణ పేదలకు సమానంగా పని దొరికిందని, మొదటిగా ఈ చట్టంలో పార్లమెంట్లో బడ్జెట్ 2:30 లక్షల కోట్లు కేటాయించారు, కానీ 2026 -27 బడ్జెట్లో కేవలం 87 వేల కోట్లు మాత్రమే కేటాయించారు, దీనిబట్టి చూస్తే చట్టం రద్దు చేసే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వ ఉన్నదని, ఈ విధానాన్ని తక్షణమే నిర్మించుకోవాలని డిమాండ్ చేశారు, లేనిపక్షంలో దేశవ్యాప్తంగా కార్మికకర్షణ పోరాటం తప్పదని మరో మారి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు,ఈ కార్యక్రమంలో మండల ఆర్గనైజర్, బాణాల రాజన్న, మండల కమిటీ సభ్యులు జిన్నా లచ్చన్న బోడుపట్ల రాజశేఖర్ కొండ ఉప్పలయ్య, సభ్యుల ప్రజలు sk షరీఫ్, బయ్య సురేష్, నలబోడు లక్ష్మారెడ్డి, అల్లి శ్రీనివాస్ రెడ్డి, పోలేపక గణేష్, ఎండి ఇమామ్ సాబ్, తాడూరి వీరేంకులు, అల్వాల యాకమ్మ, బాణాల శైలజ, తదితరులు పాల్గొన్నారు