NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 18 June 2026, 8:55 pm Posted by : NAMASTHE BHARAT

డిపో మేనేజర్ సరస్వతిని ఘనంగా సన్మానించి నా రాష్ట్ర అద్దె బస్సుల సంఘం.

డిపో మేనేజర్ సరస్వతిని ఘనంగా సన్మానించి నా రాష్ట్ర అద్దె బస్సుల సంఘం.

నర్సంపేట జూన్ 18( నమస్తే భారత్ ) :

నూతనంగా బాధ్యతలు స్వీకరించిన నర్సంపేట డిపో మేనేజర్ సరస్వతి ని తెలంగాణ రాష్ట్ర అద్దె బస్సు యాజమానుల సంఘం ప్రతినిధులు గురువారం మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమెకు శాలువా కప్పి, పూల బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అద్దె బస్సు యాజమానుల సంఘం గౌరవ అధ్యక్షులు లక్కం ప్రభాకర్ ఆధ్వర్యంలో నర్సంపేట డిపో పరిధిలోని అద్దె బస్సు యాజమానులు కలిసి డిపో మేనేజర్‌ను సన్మానించారు. అనంతరం అద్దె బస్సు యాజమానులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ సరస్వతి సానుకూలంగా స్పందిస్తూ, యాజమానుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా అద్దె బస్సు యాజమానుల సంఘం అధ్యక్షులు నాగిశెట్టి ప్రసాద్, వినయ్ రెడ్డి, దినేష్, ఫర్వేజ్, భాస్కర్ రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.