ఎస్‌ఐఆర్ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలి
ఎంపీడిఓ వేణుగోపాల్ రెడ్డి
నమస్తే భారత్ :-మరిపెడ
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం లోని నేతావత్ తండా గ్రామపంచాయతీ పరిధిలో నిర్వహించిన ఎస్‌ఐఆర్ కార్యక్రమానికి ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ఓటరు జాబితాను.పరిశీలించారు.బీఎల్‌ఓలతో మాట్లాడి ప్రతి ఓటరుకు సమాన ప్రాధాన్యత ఇస్తూ, ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా ఎస్‌ఐఆర్ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ఎస్‌ఐఆర్‌పై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలని బీఎల్‌ఓలకు సూచనలు చేశారు.ఈ సందర్భంగా గ్రామసభలో సర్పంచ్ బానోతు కొండయ్య ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి ను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీఎల్‌ఓ భారతి కవిత, పంచాయతీ కార్యదర్శి అశోక్, జీపీఓ వెంకటేశ్వర్లు, ఓటర్లు, తండా నాయకులు, యువత తదితరులు పాల్గొన్నారు.