జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి. టియుడబ్ల్యూజే (ఐజేయు) ఆద్వర్యంలో డిమాండ్స్ డే
జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి. టియుడబ్ల్యూజే (ఐజేయు) ఆద్వర్యంలో డిమాండ్స్ డే నమస్తే భారత్ :-మహబూబాబాద్ జర్నలిస్టుల హక్కులు, భద్రత, సంక్షేమానికి సంబంధించిన దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వాలు వెంటనే పరిష్కరించాలనే డిమాండ్ తో టియుడబ్ల్యూజే (ఐజేయు) మహబూబాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం డిమాండ్ ల దినోత్సవాన్ని నిర్వహించారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని మహబూబాబాద్ గాంధీపార్క్ లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి జర్నలిస్టులు నిరసన తెలిపారు. జర్నలిస్ట్ ల సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేసారు. అనంతరం మహాత్మా గాంధీ విగ్రహానికి, మహబూబాబాద్...