NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 16 August 2026, 10:26 am Posted by : NAMASTHE BHARAT

ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి

ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి

 

ఎంపీడీఓ వి. అద్వైత

ఖానాపురం ఆగష్టు15(నమస్తే భారత్ ) :
ఈ నెల 17వ తేదీ సోమవారం నుండి ఖానాపురం మండల పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ వి. అద్వైత తెలిపారు.మండల స్థాయిలో నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి 23 శాఖలకు చెందిన అధికారులు పాల్గొని ప్రజల సమస్యలను స్వీకరించి, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోనున్నారు. ప్రజలు తమ సమస్యలను జిల్లా స్థాయికి తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా, మండల స్థాయిలోనే పరిష్కరించుకునేలా ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ సూచించారు.మండల స్థాయి అధికారులు ప్రజావాణి కార్యక్రమానికి హాజరై ప్రజల సమస్యలను స్వీకరించి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ కోరారు.ప్రజలకు సత్వర, పారదర్శకమైన సేవలు అందించడమే ప్రజావాణి కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ వి. అద్వైత తెలిపారు.