అబ్బాయిపాలెంలో కోతులను నివారించాలి.
అబ్బాయిపాలెంలో కోతులను నివారించాలి. కోతుల దాడిలో జినక సోమమ్మకు తీవ్ర గాయాలు. బాధితురాలిని పరామర్శించిన సీపీఐ(ఎం) బృందం, నమస్తే భారత్ మరిపెడ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం అబ్బాయిపాలెం గ్రామంలో కోతుల బెడద రోజురోజుకూ తీవ్రరూపం దాల్చి ప్రజలను భయాందోళనకు గురిచేస్తోందని సీపీఐ(ఎం) మండల నాయకులు నందిపాటి వెంకన్న ఆందోళన వ్యక్తం చేశారు. కోతుల దాడిలో తీవ్రంగా గాయపడిన జినక సోమమ్మను శుక్రవారం సీపీఐ(ఎం) నాయకులు పరామర్శించి ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గురువారం ఇంటి ముందు పనులు చేస్తుండగా కోతులు ఒక్కసారిగా...