NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 14 July 2026, 11:23 am Posted by : NAMASTHE BHARAT

మంత్రుల సభ ఘన విజయం

మంత్రుల సభ ఘన విజయం

మక్తల్ నియోజకవర్గ ప్రజలకు పేరు పేరునా ధన్యవాదాలు*

మక్తల్–నారాయణపేట ఫోర్ లైన్ రోడ్డు ప్రారంభోత్సవానికి విచ్చేసిన రాష్ట్ర మంత్రులు *శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, శ్రీ జూపల్లి కృష్ణారావు గారు స్థానిక మంత్రివర్యులు *డా|| వాకిటి శ్రీహరి గారు*, విచ్చేసిన ఎమ్మెల్యేలు *శ్రీ యెన్నం శ్రీనివాసరెడ్డి గారు, శ్రీ వీర్లపల్లి శంకర్ గారు*, జిల్లా కలెక్టర్ *ప్రియాంక గారు* లకు మక్తల్ నియోజకవర్గ ప్రజల తరపున హృదయపూర్వక స్వాగతం పలికాము.

రూ. *237 కోట్లతో* మక్తల్–నారాయణపేట నాలుగు లైన్ల హ్యామ్ రోడ్డు పనులను ప్రారంభించిన అనంతరం, మక్తల్ పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు *మక్తల్, , మాగనూర్, నర్వ, ఆత్మకూర్ కృష్ణ. ఉట్కూర్ మండలం.తదితర అన్ని మండలాల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలు, కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, ఉప సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు మరియు సామాన్య ప్రజలందరికీ *మక్తల్ మండల కాంగ్రెస్ పార్టీ తరపున పేరుపేరునా ధన్యవాదాలు* తెలుపుతున్నాం.

*బైక్ ర్యాలీకి అపూర్వ స్పందన:
తిప్పురాజ్ పల్లి నుంచి మక్తల్ పట్టణం వరకు వేలాది సంఖ్యలో మంత్రి *డా|| వాకిటి శ్రీహరి అన్న* గారితో పాటు భారీ బైక్ ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, యువకులు, సామాన్య ప్రజలు అందరూ కాచువార్ టోల్‌గేట్ వద్ద మంత్రివర్యులకు ఘన స్వాగతం పలికి సభను విజయవంతం చేశారు.

*ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు:*
ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న మక్తల్–నారాయణపేట రహదారికి *రూ.237 కోట్లు* మంజూరు చేసిన *ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారికి*, మరియు నిధులు మంజూరులో కీలక పాత్ర పోషించిన మంత్రి *శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి* మక్తల్ నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం

ఈ రోడ్డు నిర్మాణంతో మక్తల్ నియోజకవర్గం అభివృద్ధి వేగం పుంజుకుంటుంది. రవాణా సౌకర్యాలు మెరుగుపడి, పరిశ్రమలు, వ్యాపారాలు పెరిగి యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశిస్తున్నాం.

మక్తల్ నియోజకవర్గంలో భవిష్యత్తులో జరగబోయే అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లోనూ ఇదే స్ఫూర్తితో పెద్ద ఎత్తున తరలివచ్చి సహకరించాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.

*ఇట్లు…
*శ్రీ శ్రీనివాస్ గౌడ్
*మక్తల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు