NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 12 November 2026, 10:19 pm Posted by : NAMASTHE BHARAT

అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం – ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

*అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం – ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్*

*కేశంపేట్ మండలంలో అభివృద్ధి పనులకు శ్రీకారం.. రేషన్ షాప్ ల ప్రారంభోత్సవాలు, స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ*

*దేవునిగుడి తండా, రాగ్యతండా, చింతకుంటపల్లి, పాటిగడ్డ గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే*

నమస్తే భారత్ షాద్ నగర్ నవంబర్12:కేశంపేట్ మండలంలోని దేవునిగుడి తండా, రాగ్యతండా, చింతకుంటపల్లి, పాటిగడ్డ గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు షాద్‌నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ శ్రీకారం చుట్టారు. గ్రామాల్లో నూతన రేషన్ దుకాణాల ప్రారంభోత్సవాలు, స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపనలు నిర్వహించారు.*దేవునిగుడి తండాలో రేషన్ షాప్ ప్రారంభం.. 40 స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ*
దేవునిగుడి తండా గ్రామ పంచాయతీలో చౌకధరల పంపిణీ దుకాణం సెకండ్ సేల్ పాయింట్ కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా 40 మంది లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు.అదేవిధంగా రాగ్యతండాలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు అవసరమైన పైప్‌లైన్, గేట్ వాల్ మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. అలాగే మహిళా సంఘాల సభ్యులు సమావేశాలు నిర్వహించుకోవడానికి అవసరమైన కుర్చీలు, బీరువా, జమఖానాలు అందిస్తానని తెలిపారు.*చింతకుంటపల్లిలో నూతన రేషన్ షాప్ ప్రారంభం.. 54 స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ*
చింతకుంటపల్లి గ్రామ పంచాయతీలో నూతన రేషన్ డీలర్ దుకాణాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 54 మంది లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మహిళా సంఘ భవనం నిర్మాణం పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు మంజూరు చేయిస్తానని, మహిళా సంఘాల సమావేశాల నిర్వహణకు కుర్చీలు, జమఖానాలు అందిస్తానని తెలిపారు.
*పాటిగడ్డలో రేషన్ షాప్ ప్రారంభం.. 37 మందికి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ*
పాటిగడ్డ గ్రామ పంచాయతీలో నూతన రేషన్ డీలర్ దుకాణాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం 37 మంది లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. గ్రామంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడం, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించడం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీరు, పారిశుద్ధ్యం, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. మహిళా సంఘాలను బలోపేతం చేయడంతో పాటు వారు సమావేశాలు నిర్వహించుకోవడానికి అవసరమైన సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమాల్లో కొత్తపేట సింగిల్ విండో చైర్మన్ యెన్నం శ్రీధర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి, ఎంపీడీవో రవిచంద్ర రెడ్డి, తహశీల్దార్ రాజేందర్ రెడ్డి, కేశంపేట్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగదీశ్వర్ అప్పా, బాలరాజు గౌడ్, కాంగ్రెస్ పార్టీ గిరిజన విభాగం రాష్ట్ర కోఆర్డినేటర్ రఘు నాయక్, మండల కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు వీరేశ్, నందిగామ సింగిల్ విండో చైర్మన్ చంద్రపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం చైర్మన్ జాంగారి రవి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కరుణాకర్, కల్లు సాయిలు, గ్రామాల సర్పంచులు సుజాత, శశిరేఖ, భాస్కర్ గౌడ్, శ్యామల అఖిల్, పోచామొని రమేష్, పల్లె ఆనంద్, నాగేశ్వర్, కొట్టం నరేందర్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గుండె రాణి, మహిళా కాంగ్రెస్ నాయకురాలు అనసూయ, కాంగ్రెస్ పార్టీ నాయకులు జితేందర్ రెడ్డి, కరణకర్ రెడ్డి, తుపాకుల శేఖర్, ముబారక్, సీతారాం, అన్నారం బాలు నాయక్, వేముల్ నర్వ మల్లేష్, గోపానీ భీమయ్య, కాకునుర్ లింగం, శ్రీనాథ్, రమేష్, వంశీ గౌడ్, సుదర్శన్, కృష్ణయ్య, సరికొండ రమేష్, యాదగిరి, కోడూరు రాములు, చిర్ర శ్రీను తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.