NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 21 June 2026, 10:29 pm Posted by : NAMASTHE BHARAT

సంఘటన్ సృజన్ అభియాన్‌తో పార్టీ సంస్థాగత బలోపేతమే లక్ష్యం

సంఘటన్ సృజన్ అభియాన్‌తో పార్టీ సంస్థాగత బలోపేతమే లక్ష్యం

గాంధీభవన్‌లో పార్లమెంట్ కోఆర్డినేటర్ల సమావేశం

సిర్, బీఎల్‌ఏల శిక్షణపై నేతలకు దిశానిర్దేశం

కరీంనగర్ పార్లమెంట్ కార్యకలాపాలపై నివేదిక సమర్పించిన కూన శ్రీశైలం గౌడ్

సంస్థాగత నిర్మాణం, ఓటరు నమోదు కార్యక్రమాలపై ప్రత్యేక సమీక్ష

హైదరాబాద్, జూన్ 21 (నమస్తే భారత్): కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతం, సిర్ (SIR) కార్యక్రమం సమర్థ అమలు, బూత్ స్థాయిలో పార్టీ కార్యకలాపాల విస్తరణ లక్ష్యంగా గాంధీభవన్‌లో ఆదివారం పార్లమెంట్ కోఆర్డినేటర్ల సమావేశం నిర్వహించారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో కరీంనగర్ పార్లమెంట్ కోఆర్డినేటర్, కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ సిర్ కార్యక్రమం, ఓటరు మ్యాపింగ్, బూత్ లెవల్ ఏజెంట్ల (బీఎల్‌ఏలు) బాధ్యతలు, క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన కార్యాచరణపై పార్లమెంట్ కోఆర్డినేటర్లకు మార్గనిర్దేశం చేశారు. ప్రతి బూత్‌లో పార్టీ యంత్రాంగం చురుకుగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని, ఓటరు జాబితాల పరిశీలన, నకిలీ ఓట్ల గుర్తింపు, అర్హులైన కొత్త ఓటర్ల నమోదు వంటి అంశాల్లో బీఎల్‌ఏలు సమర్థవంతంగా వ్యవహరించాలని సూచించారు. 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువతీ యువకులందరికీ ఓటరు హక్కు కల్పించే దిశగా ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించాలని, ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని నేతలు సూచించారు. పార్టీ బలోపేతానికి బూత్ స్థాయి నుంచే కృషి ప్రారంభమవ్వాలని పేర్కొన్నారు. అనంతరం కూన శ్రీశైలం గౌడ్ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సిర్ కార్యక్రమం, బీఎల్‌ఏల శిక్షణ, పార్టీ సంస్థాగత నిర్మాణానికి సంబంధించిన పురోగతిపై సమగ్ర నివేదికను సమర్పించారు. మండల, డివిజన్, మున్సిపల్ వార్డు, గ్రామ కమిటీల నియామకాలు, పార్టీ విస్తరణ కార్యక్రమాలు, క్షేత్రస్థాయి కార్యకలాపాలపై వివరించారు. సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, సురేష్ షెట్కర్, రఘురామిరెడ్డి, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.