NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 13 October 2026, 7:29 pm Posted by : NAMASTHE BHARAT

ప్రతి పట్టభద్రుడికి ఓటు హక్కు కల్పించడమే లక్ష్యం

ప్రతి పట్టభద్రుడికి ఓటు హక్కు కల్పించడమే లక్ష్యం

బిజెపి జిల్లేడు చౌదరిగూడ మండల అధ్యక్షులు ఎదిర రాజు ఆధ్వర్యంలో

జిల్లేడు చౌదరిగూడ మండల కేంద్రంలో ఎంఎల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు సమీక్ష సమావేశం

నమస్తే భారత్ షాద్ నగర్ అక్టోబర్13:పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రతి అర్హత కలిగిన పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేసి, వారికి ఓటు హక్కు కల్పించే లక్ష్యంతో జిల్లేడు చౌదరిగూడ మండల కేంద్రంలో ఎంఎల్సీ ఎన్నికల సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కార్యదర్శి ఇస్నాతి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి అర్హత కలిగిన పట్టభద్రుడికి ఓటు హక్కు కల్పించే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఓట్లను సమగ్రంగా నమోదు చేయించి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించే లక్ష్యంతో నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని సూచించారు.మండలంలోని అన్ని గ్రామాల్లో అర్హత కలిగిన పట్టభద్రులను గుర్తించి, వారికి ఓటు హక్కు కల్పించే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలోఎమ్ ఎల్ సి మండల కన్వీనర్ బోయ కుర్మయ్య జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ నవీన్ కొందుర్గు అధ్యక్షులు లక్ష్మి కాంత్ రెడ్డి ప్రధాన కార్యదర్శి గొల్ల రాజు విట్టల్ నాయక్ యాదయ్య లింగం యాదగిరి నరేష్ శ్రీధర్ రాజు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.