ఎనీమియా రహిత సమాజమే లక్ష్యం
డాక్టర్ సుగుణాకర్ రాజు
నమస్తే భారత్ :-తొర్రూరు
సికిల్‌సెల్ ఎనీమియా రహిత సమాజమే లక్ష్యమని తొర్రూరు ఏరియా ఆసుపత్రి సూపరిటెండెంట్ డాక్టర్ సుగుణాకర్ రాజు అన్నారు.
సికిల్ సెల్ దినోత్సవం సందర్భంగా శుక్రవారం డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వం ఆసుపత్రి నుంచి బస్టాండ్ కేంద్రం వరకు ఆరోగ్య సిబ్బంది ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా. డాక్టర్ సుగుణాకర్ రాజు మాట్లాడుతూ….మేనరిక వివాహాలు, వంశపారపర్యంగా సికిల్‌సెల్ ఎనీమియా వ్యాధి సంక్రమిస్తుందన్నారు. సికిల్‌సెల్ ఎనీమియా అంటువ్యాధి కాదని, జన్యుపరమైన వ్యాఽధి అని, శరీరంలో రోగ నిరోధకశక్తి తగ్గి ఆక్సిజన్ స్థాయిలు క్షీణిస్తాయన్నారు. ప్రధానంగా రక్తహీనత లోపిస్తుందన్నారు. 2047 నాటికి సికిల్‌సెల్ ఎనీమియాను పూర్తిగా నిర్మూలించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించాయని తెలిపారు. మహిళలు సికిల్‌సెల్ ఎనీమియాపై అవగాహన కలిగి ఉండాలన్నారు.ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి జ్వలిత, నందన దేవి, ప్రియాంక, ఆరోగ్య సిబ్బంది.తదితరులు.పాల్గొన్నారు.