NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 16 August 2026, 10:20 am Posted by : NAMASTHE BHARAT

దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది

*దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది*

*న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ మాస్టర్ అహ్మద్ ఖాన్*

నమస్తే భారత్ షాద్ నగర్ ఆగస్ట్ 15:నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని దేశ భవిష్యత్ యువత చేతుల్లోనే ఉందని స్వతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ నేటి యువత దేశభక్తి పెంపొందించుకోవాలని పిలుపు నిచ్చారు మాస్టర్ అహ్మద్ ఖాన్. కానీ నేడు యువత చెడు అలవాట్లకు బానిసలుగా మారారాని భాద్యతలు మరిచిపోయారాని అన్నారు. ఇప్పటికైనా యువత చెడు వ్యాసనాలకు బానిసలుగా కాకుండా క్రమశిక్షణ, భాద్యతలు చేపట్టాలని అన్నారు. ముఖ్యంగా నేడు మహిళలకు, బాలికలకు రక్షణ లేకుండ పోయిందని మహిళా అర్ధరాత్రి ఒంటరిగా తిరిగినప్పుడే నిజమైన స్వతంత్రం వచ్చినట్టు అని గాంధీ గారు చెప్పారు కానీ ఇప్పుడు మహిళలు రాత్రి కాదుకదా పగలు కూడా స్వేచ్ఛ గా తిరిగే పరిస్థితి లేదు. అందుకే మహిళలు, బాలికలు ఆత్మరక్షణ కొరకు కుంగ్ ఫు, కరాటే వంటి విద్యలను నేర్చుకోవాలని వాటి ద్వారా తమను తాము రక్షించుకునే అవకాశం ఉంటుందని అన్నారు. ఈ విద్యల వల్ల శరీరం దృఢత్వం గా ఉండి ఎన్నో ఆరోగ్య సమస్యలు రాకుండ ఉంటుందని అందుకే ప్రతి ఒక్కరు కుంగ్ ఫు, కరాటే, ఇంకా వేరే విద్యలు నేర్చుకొని తమని తాము కాపాడుకుంటూ దేశానికి మరింత సేవా చేయాలనీ అన్నారు. ఈ సందర్బంగా షాద్ నగర్ నియోజకవర్గ ప్రజలందరికి న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ తరుపున స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.