NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 15 August 2026, 1:04 pm Posted by : NAMASTHE BHARAT

ఓటరు జాబితా సవరణలో బూత్‌ స్థాయి నేతల కృషి అభినందనీయo

ఓటరు జాబితా సవరణలో బూత్‌ స్థాయి నేతల కృషి అభినందనీయo

బూత్‌ స్థాయి అధికార ప్రతినిధులు, సీనియర్‌ నాయకులకు ఘన సన్మానం

దుండిగల్, ఆగస్టు 14 (నమస్తే భారత్): ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో అంకితభావంతో పనిచేసిన బూత్‌ స్థాయి అధికార ప్రతినిధులు, సీనియర్‌ నాయకులు, డివిజన్‌ అధ్యక్షులను కాంగ్రెస్‌ నాయకులు ఘనంగా సన్మానించారు. బహదూర్‌పల్లిలోని మేకల వెంకటేశం ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దుండిగల్‌, బౌరంపేట్‌, బహదూర్‌పల్లి డివిజన్లకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గ సమన్వయకర్త ఏపీ మిథున్‌రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి కొలన్‌ హన్మంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌, నర్సారెడ్డి భూపతిరెడ్డి, బొంగునూరి కిషోర్‌రెడ్డి, బొంగునూరి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఓటర్ల వివరాల పరిశీలనతో పాటు అర్హులైన కొత్త ఓటర్ల నమోదులో బూత్‌ స్థాయి నాయకులు, కార్యకర్తలు చేసిన కృషి అభినందనీయమని నాయకులు పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ సమన్వయంతో పనిచేసి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.