కార్మిక శాఖ లో నిధులు దారి మళ్లింపు ఆపాలి.

-తాసిల్దార్ కార్యాలయం
ముందు ధర్నా లో
-భవన నిర్మాణ కార్మిక
సంఘం మండల
అధ్యక్షుడు కొండ ఉప్పలయ్య
నమస్తే భారత్ :-మరిపెడ
కార్మిక శాఖ వెల్ఫేర్ బోర్డు స్కీం లను ప్రవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అంటగడుతూ. కార్మిక శాఖ నిధులను దారుమర్లించి దుర్యోనియోగం చేస్తున్నారని భవన కార్మిక సంఘం సిఐటియు అనుబంధం మండల అధ్యక్షులు కొండ ఉప్పలయ్య అన్నారు.
సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మంగళవారం మరిపెడ మండల కేంద్రంలోని స్థానిక తహసిల్దార్ కార్యాలయం ముందు భవన నిర్మాణ కార్మికులు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తూ ధర్నా నిర్వహించారు. అనంతరం తహసిల్దార్ కొండపల్లి కృష్ణవేణి కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కొండ ఉప్పలయ్య మాట్లాడుతూ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం ప్రజా పాలన అందిస్తామని అధికారంలోకి వచ్చిన బిజెపి కాంగ్రెస్ ప్రభుత్వాలు భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డు నిధులు దుర్వినియోగం అవుతున్న పట్టించుకోవడంలేదని విమర్శించారు.భవన నిర్మాణ కార్మికులకు బోర్డు ద్వారా అమలవుతున్న ప్రమాద మరణం, సహజ మరణం,శాశ్విత,పాక్షిక అంగవైకల్యం లాంటి స్కీములను జీవో నెంబర్ 12 ద్వారా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇస్తూ 346.36 కోట్ల క్రెడిట్ యాక్సిస్ లైఫ్ ఇన్సూరెన్స్, ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వడం కార్మికులకు అన్యాయం చేయడమేనని ఇదేనా ప్రజాపాలన అని ప్రశ్నించారు. సిఎస్ సి హెల్త్ కేర్ టెస్టులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.లక్షలాది మంది నిర్మాణ రంగా కార్మికుల రెక్కల కష్టంతో పోగుపడ్డ సంపదను కార్మికుల సంక్షేమాన్ని కాకుండా ప్రవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు దోచిపెట్టడం అన్యాయమని విమర్శించారు.అవసరం ఉన్నా లేకున్నా ప్రతి కార్మికుడు పేరు మీద 2వేల 309 ప్రీమియం చెల్లిస్తూ పోతే బోర్డు నిధులు రోజురోజుకు తరుగుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే సిఎస్ సి హెల్త్ చెకప్ పేరుతో 750 కోట్లు కాజేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వాటిని ఆపాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని కోరారు. లేనియెడల మంత్రులను ఎమ్మెల్యేలను గ్రామాలు తిరుగనీయకుండా, ఇందిరమ్మ ఇల్లు కట్టకుండా నివారిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సమావేశంలో మండల ప్రధాన కార్యదర్శి పసుపులేటి యాదగిరి, కే రాంబాబు, కే వెంకన్న, బిక్షం, సైదులు, రాములు, వాసు, వెంకన్న, బిక్కు, ముత్తిలింగం, వెంకట్ రాములు, ఎల్లయ్య, చిరంజీవి, మైసయ్య తదితరులు పాల్గొన్నారు