వీరాపురం ఇసుక రీచ్ వివాదాన్ని పరిష్కరించి రెండు గిరిజన సొసైటీలకు సమన్యాయం చేయాలి

వీరాపురం ఇసుక రీచ్ వివాదాన్ని పరిష్కరించి రెండు గిరిజన సొసైటీలకు సమన్యాయం చేయాలి – జిల్లా కలెక్టర్‌ను కలిసిన తుడుం దెబ్బ నాయకులు నమస్తే భారత్: భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో (మూర్తి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వీరాపురం ఇసుక రీచ్‌కు సంబంధించి రెండు గిరిజన సహకార సంఘాల మధ్య కొనసాగుతున్న వివాదాన్ని పరిష్కరించి, ప్రభుత్వం ఆమోదించిన ఇసుక క్వాంటిటీని సమన్యాయ పద్ధతిలో పంపిణీ చేయాలని కోరుతూ తుడుం దెబ్బరాష్ట్ర ఉపాధ్యక్షుడు అలెం కోటి తుడుందెబ్బ వర్కింగ్ ప్రెసిడెంట్ ముక్తి రాజుఆదివాసి పొలిటికల్ జేఏసీ చైర్మన్...