NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 18 July 2026, 7:55 pm Posted by : NAMASTHE BHARAT

సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలి

*సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలి*,

 

*ప్రజల జీవన విధానాన్ని దెబ్బతీసే చర్యలను ప్రభుత్వం ఆపాలి,*

 

*ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రజల పక్షాన నిలవాలి*

 

*బీజేపీ యువమోర్చా నాయకులు గట్టు శివలింగం,*

 

నమస్తే భారత్ షాద్ నగర్ జులై 18:సిద్ధాపూర్‌లో డంపింగ్ యార్డ్ ఏర్పాటు నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని షాద్‌నగర్ బీజేపీ యువమోర్చా నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు డంపింగ్ యార్డ్ ఏర్పాటుతో ప్రజల జీవన విధానంపై తీవ్ర ప్రభావం పడటమే కాకుండా పశు సంరక్షణకు కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది ఈ నిర్ణయం అమలైతే పరిసర ప్రాంతాల్లోని అనేక గ్రామాలు అస్తవ్యస్తమయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో భూసేకరణ సమయంలో ప్రజలకు ఫుడ్ ప్రాసెసింగ్ ఐటీ వంటి పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి భూములు తీసుకున్నారని ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే భూములను డంపింగ్ యార్డ్ కోసం వినియోగించాలనే నిర్ణయం తీసుకోవడం సరైన విధానం కాదని బీజేపీ యువమోర్చా నాయకులు గట్టు శివలింగం విమర్శించారు షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రజల ఓట్లతో గెలిచిన ప్రజాప్రతినిధిగా ప్రజల సమస్యలపై స్పందించాలని వారు డిమాండ్ చేశారు సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ప్రజల పక్షాన నిలిచి ఉద్యమించాలని కోరారు ప్రజల ప్రయోజనాలను కాపాడలేని పరిస్థితి ఉంటే ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేసి ప్రజలతో కలిసి పోరాడాలని బీజేపీ యువమోర్చా నాయకులు ఘాటుగా వ్యాఖ్యానించారు ప్రజలు ఓటు వేసి గెలిపించినందుకు వారి జీవితాలను ఇబ్బందుల్లోకి నెట్టడం సరికాదు ప్రభుత్వం మంచి చేయకపోయినా పర్వాలేదు కనీసం ప్రజలు ప్రశాంతంగా జీవించే హక్కును కాపాడాలి ప్రజల జీవితాలతో చెలగాటమాడే నిర్ణయాలను వెంటనే నిలిపివేయాలి అని వారు అన్నారు డంపింగ్ యార్డ్ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలని సంబంధిత జీవోను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు లేదంటే కాంగ్రెస్ పార్టీకి షాద్ నగర్ నియోజకవర్గం లో ప్రజా వ్యతిరేకత తప్పదని హెచ్చరించారు స్థానిక కాంగ్రెస్ నాయకులు ప్రజల సమస్యపై స్పందించకుండా మౌనం వహిస్తే భవిష్యత్తులో రాజకీయంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఒంటెద్దు పోకడతో ముందుకు సాగితే బీజేపీ యువమోర్చా ఊరుకోదని స్పష్టం చేశారు సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ త్వరలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని అవసరమైతే షాద్‌నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని బీజేపీ యువమోర్చా తరఫున హెచ్చరించారు.