NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 27 August 2026, 8:34 pm Posted by : NAMASTHE BHARAT

కాంగ్రెస్ సీనియర్ నాయకులు మునిగ మొగిలికి పార్టీ జెండా కప్పి ఘన నివాళులర్పించిన డీసీసీ

కాంగ్రెస్ సీనియర్ నాయకులు మునిగ మొగిలికి పార్టీ జెండా కప్పి ఘన నివాళులర్పించిన డీసీసీ

 

పార్టీ కోసం ఆయన చేసిన సేవలు మరువలేనివి — డీసీసీ అధ్యక్షురాలు,AMC చైర్మన్ గంట , మండల అధ్యక్షులు సమ్మిగౌడ్

 

నమస్తే భారత్ :-కేసముద్రం

 

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కాట్రపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ మునిగ మొగిలి నిన్న సాయంత్రం 5:30 గంటలకు స్వర్గస్తులయ్యారు. మునిగ మొగిలి కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా అంకితభావంతో పనిచేస్తూ, పార్టీ బలోపేతానికి విశేష సేవలందించారు.ఆయన మృతి విషయం కాంగ్రెస్ పార్టీ కేసముద్రం మండల అధ్యక్షులు చిలువేరు సమ్మయ్య గౌడ్ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి ఉమా మురళి నాయక్ దృష్టికి తీసుకెళ్లడంతో, వెంటనే కాట్రపల్లి గ్రామానికి చేరుకున్న ఆమె అంతిమక్రియల్లో పాల్గొన్నారు. తాను మరణించిన అనంతరం కూడా కాంగ్రెస్ పార్టీ జెండాతోనే తనకు అంతిమ వీడ్కోలు పలకాలని మునిగ మొగిలి కోరుకున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన చివరి కోరికను గౌరవిస్తూ ఉమా మురళి నాయక్ కాంగ్రెస్ పార్టీ కండువాను పార్థివదేహంపై కప్పి.ఘన.నివాళులర్పించారు.ఉమా మురళి నాయక్ మాట్లాడుతూ.మునిగ మొగిలి కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సంవత్సరాలుగా అంకితభావంతో సేవలందించారు. పార్టీ కోసం ఆయన చేసిన సేవలు, కృషి ఎప్పటికీ మరువలేనివి. ఆయన మృతి కాంగ్రెస్ పార్టీకి, కాట్రపల్లి గ్రామానికి తీరని లోటు. కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన ప్రతి నాయకుడు, కార్యకర్తకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది” అని అన్నారు.అనంతరం మృతుని కుటుంబ సభ్యులు భార్య వెంకటమ్మ, కుమారుడు హరీష్, కుమార్తెలు సలీమా,అలీమాలను.పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని.భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గంట సంజీవరెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు చిలువేరు సమ్మయ్య గౌడ్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ అల్లం నాగేశ్వరరావు, ఆర్టీఐ మెంబర్ రావుల మురళి, జిల్లా కాంగ్రెస్ నాయకులు మహేందర్ రెడ్డి, కౌన్సిలర్ వీరేష్ యాదవ్, కట్ట ప్రభాకర్, తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.అలాగే కాట్రపల్లి సర్పంచ్ ఎదురుబోయిన సూరయ్య, ఉపసర్పంచ్ చాగంటి యాదగిరి, గ్రామ కమిటీ అధ్యక్షులు జల్లే యాకాంబరం, ఉపాధ్యక్షులు పుట్ట ప్రభాకర్,కాంగ్రెస్ నాయకులు లక్ష్మణ్ నాయక్ వార్డు సభ్యులు జల్లే మహేష్, కే. కృష్ణవేణి, కే. కలమ్మ, పుట్ట ధనమ్మ, సీనియర్ నాయకులు సిరికొండ మల్లయ్య, బారా శ్రీనివాస్, అడప రవీందర్, సోలాపురం సంజీవరెడ్డి, బేతు సత్యం, లాల్‌సింగ్, బోడ నరేష్, బావుసింగ్, చంద్రయ్య, బొంత సంపత్, శివ, నరేష్ తదితరులు పాల్గొని