NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 17 July 2026, 10:06 pm Posted by : NAMASTHE BHARAT

జులై 20న చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

జులై 20న చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు వెంకటయ్య

నమస్తే భారత్, రాజేంద్రనగర్, జులై 17, జులై 25 జరిగే కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు వెంకటయ్య తెలిపారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం మైలార్దేవులపల్లిలో శుక్రవారం భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో కరపత్రం విడుదల చేసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు వెంకటయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు లేబర్ కోడులను అమలు చేసి భవన నిర్మాణ కార్మికులపై ఉక్కు పాదం మోపుతోందని అన్నారు. అదేవిధంగా సంక్షేమ బోర్డులోని పథకాలను ప్రైవేటీకరణ చేస్తూ కార్మికులను సైతం మోసం చేస్తున్నారని సిఎస్సి హెల్త్ టెస్ట్ చేసి 750 కోట్లు ప్రైవేట్ సంస్థకు దోచిపెట్టింది అన్నారు. లేబర్ ఇన్సూరెన్స్ కార్డులను రద్దు చేస్తామనడం సమంజసం కాదన్నారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు బిక్షపతి, దుర్గ ప్రసాద్, చంద్రయ్య, యూత్ ప్రెసిడెంట్ దీపక్, యూత్ కార్యదర్శి సాయిలు, తదితరులు పాల్గొన్నారు.