NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 23 July 2026, 7:33 pm Posted by : NAMASTHE BHARAT

కాంగ్రెస్ అగ్ర నేతల అరెస్టు ఆ ప్రజాస్వామికం నీట్,జెఈఈ పరీక్షల లీకేజ్ పై కేంద్రం బాధ్యత వహించాలి

కాంగ్రెస్ అగ్ర నేతల అరెస్టు ఆ ప్రజాస్వామికం

నీట్,జెఈఈ పరీక్షల లీకేజ్ పై కేంద్రం బాధ్యత వహించాలి

నమస్తే భారత్ :-తొర్రూరు

నీట్, జేఈఈ ప్రవేశ పరీక్షల ప్రశ్న పత్రాల లీకేజ్ కి నిరసనగా ఢిల్లీలో శాంతియుతంగా ఆందోళన చేపట్టిన కాంగ్రెస్ అగ్ర నేతలు, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే, ఎంపీ ప్రియాంక గాంధీ లను అరెస్టు చేయడం అప్రజాస్వామి కమని తొర్రూరు మున్సిపల్ చైర్మన్ తూనం శ్రావణ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోత్కూరి రవీంద్ర చార్యులు విమర్శించారు. కాంగ్రెస్ అగ్ర నేతల అరెస్టులకు నిరసనగా గురువారం డివిజన్ కేంద్రంలోని గాంధీ సెంటర్ లో కాంగ్రెస్ పార్టీ మండల, పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీట్ జేఈఈ వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల ప్రశ్న పత్రాల లీకేజ్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో పరీక్షల నిర్వహణపై విద్యార్థులు,యువతలో విశ్వాసం దెబ్బ తిన్నదని విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర విద్యా శాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ సోమ రజిని రాజశేఖర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ముద్దసాని సురేష్, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి బి. వెంకన్న యాదవ్, సీనియర్ నాయకులు డాక్టర్ పోనుగోటి సోమేశ్వరరావు, మేకల కుమార్,జక్కుల రామ్ రెడ్డి, చిత్తలూరి శ్రీనివాస్, జలకం శ్రీనివాస్, చెవిటి సుధాకర్, కందాడి అచ్చిరెడ్డి, మహబూబ్ రెడ్డి, రవి నాయక్, గుండాల నర్సయ్య, విక్రమ్ రెడ్డి, సర్పంచ్లు బంగారు రమేష్, ఎర్ర వెంకటరెడ్డి, జాటోత్ రాం లాల్, అభిరాం నాయక్, నరేందర్, విజయ రవి, గంగా నరేష్,నాయకులు వెన్నం సోమిరెడ్డి, మిత్తింటి హరీష్,దొంగరి శంకర్, రాజేష్ యాదవ్,ప్రవీణ్ యాదవ్, మహేష్ యాదవ్, బుచ్చి రాజులు, రమేష్ రావు,వి. రాజు, రాంబాబు, అన్వేష్, పరశురాములు, ఎర్రం రాజు తదితరులు పాల్గొన్నారు.