NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 02 October 2026, 10:48 pm Posted by : NAMASTHE BHARAT

*పేదరికాన్ని అధిగమించి డాక్టరేట్ పట్టా సాధించిన దూసకల్ ముద్దుబిడ్డ*

*పేదరికాన్ని అధిగమించి డాక్టరేట్ పట్టా సాధించిన దూసకల్ ముద్దుబిడ్డ*

*పట్టుదల, కృషితో ఉన్నత శిఖరాలకు చేరుకున్న డాక్టర్ సంగెం ప్రభాకర్*

నమస్తే భారత్ షాద్ నగర్,అక్టోబర్ 01:దూసకల్ గ్రామం, ఫరూఖ్ నగర్ మండలం, రంగారెడ్డి జిల్లా ఒక నిరుపేద కుటుంబానికి చెందిన సంగెం సుశీల మరియు బుచ్చయ్య ల కుమారుడు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, కష్టనష్టాలనుb ఎదుర్కొంటూనే తన లక్ష్యాన్ని వదలకుండా పట్టుదలతో విద్యను కొనసాగించిన సంగెం ప్రభాకర్ అరుదైన ఘనతను సాధించారు. తన కృషి, పట్టుదల, ఆత్మవిశ్వాసంతో ఉన్నత అత్యున్నత విద్యను అభ్యసించి డాక్టరేట్ పట్టా అందుకుని గ్రామానికి పేరుప్రతిష్టలు, తల్లిదండ్రులకు గౌరవాన్ని తీసుకొచ్చారు.
ప్రతిష్టాత్మక హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో 01-10-2026 గురువారం రోజున నిర్వహించిన 26వ స్నాతకోత్సవ వేడుకల్లో తెలంగాణ గౌరవ గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా గారి ఆధ్వర్యంలో డాక్టరేట్ పట్టా ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఇంచార్జి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అనురాధ గారు, DRDO చైర్మన్ డా. సమీర్ వి. కామత్ గారి చేతుల మీదుగా డాక్టర్ సంగెం ప్రభాకర్ డాక్టరేట్ పట్టా అందుకున్నారు.
చిన్ననాటి నుంచి పట్టుదలతో ఎన్నో పరిస్థితులను ఎదుర్కొంటూ, ఆర్థిక ఇబ్బందులు తన చదువుకు అడ్డంకిగా మారకుండా ముందుకు సాగిన ప్రభాకర్‌ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు. డాక్టరేట్ సాధించాలనే సంకల్పం, నిరంతర శ్రమ, గురువుల మార్గదర్శకత్వం, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉంటే ఎలాంటి పరిస్థితులనైనా అధిగమించి ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని ఆయన తన విజయంతో నిరూపించారు.
డాక్టరేట్ పట్టా అందుకున్న ఈ రోజు తన విద్యా ప్రస్థానంలో ఒక చిరస్మరణీయమైననా జీవితంలో ఈ రోజు ఎంతో ప్రత్యేకమైనది. డాక్టరేట్ పట్టా అందుకున్న ఈ ఆనంద క్షణంలో నా కళ్ల ముందు కనిపించేది కేవలం ఒక విజయమే కాదు… ఈ స్థాయికి నన్ను తీసుకువచ్చిన అనేక మంది మనుషుల ప్రేమ, త్యాగం, ప్రోత్సాహం, ఆశీర్వాదాలు మైలురాయిగా నిలిచిపోతుందని డాక్టర్ సంగెం ప్రభాకర్ తెలిపారు. ఈ స్థాయికి చేరుకోవడానికి తనకు అండగా నిలిచిన గురువులు, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, మిత్రులు, అందరికీ ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
తన విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరి ప్రోత్సాహం, ఆశీర్వాదాలు ఎప్పటికీ మరువలేనివని పేర్కొన్నారు. ఈ డాక్టరేట్ పట్టా తన ఒక్కరి విజయం మాత్రమే కాదని, తనపై నమ్మకం ఉంచిన కుటుంబ సభ్యులు, గురువులు, మిత్రులు మరియు తన స్వగ్రామ ప్రజలందరి విజయంగా భావిస్తున్నానని తెలిపారు.నిరుపేద కుటుంబం నుంచి ప్రారంభమైన ప్రయాణం డాక్టరేట్ పట్టా వరకు సాగిన ఈ విజయ ప్రస్థానం దూసకల్ గ్రామ యువతకు, విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తోంది. పట్టుదల ఉంటే పేదరికం ప్రతిబంధకం కాదని, కష్టపడితే ఉన్నత లక్ష్యాలను సాధించవచ్చని డాక్టర్ సంగెం ప్రభాకర్ నిరూపించారు.
ఈ సందర్భంగా దూసకల్ గ్రామ ప్రజలు, మిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు మరియు పలువురు అభినందనలు తెలియజేస్తూ,
కష్టం ఎంత పెద్దదైనా… లక్ష్యం ముందు అది చిన్నదే.
పట్టుదలతో అడుగులు వేస్తే విజయం తప్పక సొంతమవుతుంది.