NAMASTHE BHARAT
Newspaper Banner
Date of Publish : 10 July 2026, 8:40 pm Posted by : NAMASTHE BHARAT

రాజస్థాన్ హత్యాచార నిందితులను నడిరోడ్డుపై ఉరితీయాలి.

రాజస్థాన్ హత్యాచార నిందితులను నడిరోడ్డుపై ఉరితీయాలి.

సీపీఐ మండల కార్యదర్శి జంపాల వెంకన్న.

గార్ల నెహ్రూ సెంటర్‌లో రాస్తారోకో.

నమస్తే భారత్ :-గార్ల

రాజస్థాన్ రాష్ట్రంలో 13 సంవత్సరాల.​మైనర్ బాలికపై 32 మంది మృగాళ్ల దాడిని తీవ్రంగా ఖండించిన జంపాల వెంకన్న
రాజస్థాన్ రాష్ట్రంలో 13 సంవత్సరాల మైనర్ బాలికను 32 మంది కీచకులు కిడ్నాప్ చేసి, ఐదు రోజుల పాటు బంధించి, అత్యంత అమానుషంగా గ్యాంగ్ రేప్ చేసి హతమార్చిన ఘాతుకాన్ని నిరసిస్తూ గార్ల మండల కేంద్రంలో నిరసన కార్యక్రమ చేస్తున్నాం.. ఈ పాశవిక చర్యకు పాల్పడిన నరరూప రాక్షసులను తక్షణమే సభ్య సమాజం ముందు ఉరితీయాలని డిమాండ్ చేశారు.. దేశంలో మహిళలు, మైనర్ బాలికలపై రోజురోజుకూ పెరుగుతున్న లైంగిక దాష్టీకాలు, హత్యాచారాలు సమాజానికే శాపంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాలు ఎన్ని ఉన్నా మృగాళ్లలో భయం కలగడం లేదని, 32 మంది కలిసి ఒక చిన్నారిని బలితీసుకోవడం మానవత్వానికే తీరని మచ్చ అని మండిపడ్డారు. ఈ కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా తక్షణ విచారణ జరిపి, నిందితులకు నడిరోడ్డుపై ఉరిశిక్ష అమలు చేయాలని డిమాండ్ చేశారు.
​ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు రాగం రమేష్, మేదరమెట్ల గిరిప్రసాద్, భూక్య హరినాయక్, మాగం లోకేష్, రాజేష్, రాంబాబు, ఉపేందర్, మల్లేశం, రాములు, ఉదయ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు